For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ సౌత్ ఇండియన్ ఫ్రైడ్ రైస్ రిసిపి: న్యూట్రీషియన్ ఫుడ్

|

సాధారణంగా అన్నంతో వివిధ రకాల ఫ్రైడ్ రైస్ రిసిపిలను తయారుచేసుకుంటాము. చైనీస్ ఫ్రైడ్ రైస్ ను తలపించే సౌత్ ఇండియన్ ఫ్రైడ్ రైస్ రిసిపిని మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా?

సౌత్ ఇండియన్ ఫ్రైడ్ రైస్ రిసిపి చాలా సింపుల్ గా తయారుచేసుకోవచ్చు. ఈ వంటకు ఉపయోగించే ఫ్రెష్ వెజిటేబుల్స్ వల్ల మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా పొందవచ్చు. మరి ఈ హెల్తీ అండ్ సౌత్ ఇండియన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Special South Indian Fried Rice Recipe: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు
బాస్మతి రైస్ - 500 gms
క్యాప్సిక్ - 1 cup (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు - 1 cup (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
క్యారెట్- 1 cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
రింగ్ బీన్స్ - 1 cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

READ MORE: సాసేజ్ ఫ్రైడ్ రైస్ రిసిపి : ఇండియన్ స్టైల్
టమోటో - 1 cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 tbsp
పచ్చిమిర్చి - 5 to 6
జీడిపప్పు - 10
యాలకలు - 3 to 4
జీలకర్ర - 1 tbsp
టమోటో సాస్ - 3 tbsp
చిల్లీ సాస్ - 2 tbsp
పసుపు - 1/2 tbsp
కొత్తిమీర - 8 to 10 strands
ఉప్పు: రుచికి తగినంత
నూనె తగినంత

READ MORE: హెర్బ్ ఫ్రైడ్ రైస్ రిసిపి -బెటర్ హెల్త్

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో నూనె వేసి వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులో జీలకర్ర, పసుపు, యాలకలు, జీడిప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి వేయాలి.
3. ఇప్పుడు అందులో క్యారెట్, క్యాప్సికమ్, టమోటో మరియు సన్నగా తరిగిన రింగ్ బీన్స్ మొత్తం వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే టమోటో, పచ్చిమిర్చి సాస్ కూడా వేసి వేగించుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
5. నీళ్ళ మరుగుతుండగా బాస్మతి రైస్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
6. మొత్తం మిశ్రమం కలగలిసేలా మిక్స్ చేయాలి. తర్వాత అందులో ఉప్పు వేసి మిక్స్ చేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
7. మూడువిజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం తగ్గినత తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగు వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే సౌత్ ఇండియన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ రిసిపి రెడీ...

English summary

Special South Indian Fried Rice Recipe: Telugu Vantalu

Most of us have tried the chinese fried rice. But have you ever tried south indian fried rice? Well, today we will teach you how to make south india fried rice. South Indian Fried Rice Recipe can be eaten either for luch or for breakfast. As it contains vegetables it is highly nutritious.
Story first published: Tuesday, August 11, 2015, 15:11 [IST]
Desktop Bottom Promotion