For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ స్వీట్ కార్న్ రైస్ రిసిపి

|

స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉండే మీల్ లేదా డిన్నర్ ఫుడ్ ఇది టేస్ట్ బడ్స్ కు మరింత రుచి అందిస్తుంది. ముఖ్యంగా స్వీట్ కార్న్ రైస్ ను బాస్మతి రైస్ తో తయారుచేస్తే మంచి ఫ్లేవర్ తో పాటు టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ను మీల్స్ లేదా డిన్నర్లో కూడా తీసుకోవచ్చు .

అంతే కాదు, ఈ సింపుల్ రిసిపిని చాలా త్వరగా తయారు చేసి ఫ్యామిలీ మెంబర్ కు లేదా అనుకోకుండా వచ్చిన అతిథులకు అందివ్వవ్వచ్చు . ఖచ్చితంగా వారికి నచ్చుతుంది. మరి వెజిటేబుల్స్ తో పాటు స్వీట్ కార్న్ జోడించడం వల్ల చాలా వెరైటీగా ఉంటుంది. మరి ఈ స్పైసీ అండ్ టేస్టీ స్వీట్ కార్న ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Special Sweet Corn Rice Recipe in Telugu

బాస్మతి రైస్ : 250 gms(అరగంట నీటిలో నానబెట్టుకోవాలి)
కార్న్ : 2 cup
ఆనియన్ : 1 cup
క్యాక్సిమ్ : 1 cup
అల్లం : 1/4 tsp
వెల్లుల్లిపేస్ట్ : 1/4 tsp
బంగాళదుంప : 1 cup
పచ్చిమిర్చి: 4 to 5
గరం మసాలా : 1 tsp
పసుపు: 1/4 tsp
జీలకర్ర: 1/4 tsp
నూనె: సరిపడే

తయారు చేయు విధానం:
1. ఉల్లిపాయలను సన్నగా తరిగి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన బియ్యం, బంగాళదుంప మరియు స్వీట్ కార్న్ వేయాలి . అలాగే కొద్దిగా నూనె మరియు సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేసి మూత పెట్టి 3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. మరో పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, మరియు పచ్చిమిర్చి వేసి వేగించాలి.
4. అంతలోపు కుక్కర్ లో స్వీట్ కార్న్ రైస్ రెడీ అవుతుంది. స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ లోని ఆవిరి మొత్తం తగ్గనివ్వాలి.
5. కుక్కర్లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత స్వీట్ కార్న్ రైస్ ను బయటకు తీసి పాన్ లో వేగుతున్న మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే స్వీట్ అండ్ స్పెషల్ స్వీట్ కార్న్ రైస్ రిసిపి రెడీ...

English summary

Special Sweet Corn Rice Recipe in Telugu

Special Sweet Corn Rice Recipe in Telugu, Telugu Vantalu, Sweet corn fried rice tastes so good that you will definelty have it for your breakfast, lunch and dinner too. In the recipe that we are preparing today, potatoes and onions are also added to give it an awesome taste.
Story first published: Thursday, November 5, 2015, 17:28 [IST]
Desktop Bottom Promotion