For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ చిల్లీ పనీర్ గ్రేవీ రిసిపి : మాన్ సూన్ స్పెషల్

|

సాధారణంగా చైనీస్ ఫుడ్ స్పైసీ తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చైనీస్ కుషన్ ను మన ఇండియన్ టేస్ట్ కు తగ్గట్టు స్పైసీగా కొన్ని ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తున్నాం. అందుకే దీన్ని ఇండో చైనీ కుషన్ అంటాము . ఈ ఇండో చైనీ కుషన్ ప్రత్యేకతేంటంటే చిల్లీ పనీర్ డిష్ చీల్లీ పనీర్ అందరీకి నచ్చిన స్పైసీ వంటకం. వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా ఇద్దరూ వీటిని ఇష్టపడుతారు.

చిల్లీ పనీర్ డ్రై చాలా సులభంగా మరియు సింపుల్ గా తయారు చేసేటటువంటి పనీర్ వంటకం. ఈ స్పైసీ డిష్ ఇండియన్ రెస్టారెంట్స్ లో చాలా పాపులర్ అయినటువంటి స్టార్టర్. ఈ రిసిలో పన్నీర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఈ రిసిపికి కొన్ని మసాలా దినుసులతో పాటు క్యాప్సికమ్ మరియు పచ్చిమిర్చిలు అల్లం వెల్లుల్లి మరింత టేస్ట్ ను అందిస్తాయి. సాఫ్ట్ గా ఉండే కాటేజ్ చీజ్ తో తయారుచేసే ఈ స్పైసీ ఫుడ్ మీరు కూడా టేస్ట్ చేయాలంటే ట్రై చేసి చూడండి...

Spicy Chilli Paneer Gravy

పనీర్ - 500 g (2 cups)
పచ్చిమిర్చి - 5 to 6
కారం - 1/2 teaspoon
బియ్యం పిండి - 1 teaspoon
కార్న్ ఫ్లోర్ - 2 tablespoons
రెడ్ చిల్లీ సాస్ - 1 teaspoon
సోయా సాస్ - 1 teaspoon
టమోటో పేస్ట్ - 1 cup
ఉల్లిపాయ ముక్కలు - 1 cup
గ్రీన్ క్యాప్సికమ్ - 1/2 cup
అల్లం - 1/2 teaspoon
వెల్లుల్లి - 1/2 teaspoon
నిమ్మరసం - 1/2 teaspoon
కొత్తిమీర - 1/2 cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకునొ అందులో బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, ఉప్పు, నీరు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
2. తర్వాత ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు వేసి సున్నితంగా కలిపి , పెట్టుకోవాలి. మసాలా మిశ్రమం పనీర్ ముక్కలకు బాగా పట్టించాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. 4. నూనె వేడి అయ్యాక అందులో మసాలాలో కలిపి పెట్టుకున్న పనీర్ క్యూబ్ వేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి . బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వీటిని ఫ్రై చేసి పెట్టుకోవాలి. పక్కన తీసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మరో పాన్ తీసుకుని , అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమోటో ముక్కలు మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
6. 5 నిముషాల తర్వాత ఫ్రైడ్ పన్నీర్ క్యూబ్స్ వేసి ఫ్రై చేయాలి .
7. రుచికి సరిపడా ఉప్సు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
8. తర్వాత అందులోనే కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర తరుగు చిలకరించాలి. అంతే స్పైసీ చిల్లీ పనీర్ గ్రేవీ రిసిపి రెడీ. వేడి వేడి రోటి మరియు రైస్ కు బెస్ట్ కాంబినేషన్ .

English summary

Spicy Chilli Paneer Gravy: A Must Try

Spicy Chilli Paneer Gravy: A Must Try
Story first published:Friday, July 15, 2016, 12:37 [IST]
Desktop Bottom Promotion