For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మష్రుమ్ మరియు బేబీకార్న్ స్పైస్ డిష్

|

మష్రుమ్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది ఒక ఫర్ఫెక్ట్ రిసిపి!ఎందుకంటే, ఈ వంటకు ఎక్కువగా ఇండియన్ మసాలలను జోడించడం వల్ల అద్భుతమైన రుచి అందిస్తుంది. రుచి మాత్రమే కాదు బేబీ కార్న్, మష్రుమ్ కాంబినేషన్ లో డిష్ లో న్యూట్రీషియన్ వ్యాల్యూస్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

మరి టేస్ట్ బడ్స్ కు ఒక కొత్తరుచి, ఆరోగ్యానికి మేలు చేసి మష్రుమ్, కార్న్ కాంబినేషన్ డిష్ ను చాలా సింపుల్ గా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ డిష్, రైస్ మరియు రోటీలకు ఒక ఫర్ఫెక్ట్ కాంబినేషన్ . మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Serves: 4
Preparation time: 15 mins
Cooking time: 30 mins

కావల్సిన పదార్థాలు:
బటన్ పుట్టగొడుగు (ఫ్రెష్) - 2 ప్యాకెట్లు (400 గ్రాములు)
బేబీ కార్న్ (ఫ్రెష్) - 1 ప్యాకెట్ (200 గ్రాములు)
కరివేపాకు - గుప్పెడు
స్ప్రింగ్ ఆనియన్ (చిన్న ఉల్లిపాయలు) - 1cup
కొత్తిమిర - గుప్పెడు
ఉల్లిపాయలు - 2 పెద్దవి(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు- 8-10
అల్లం వెల్లుల్లి పేస్ట్- 2tsp
ఎర్ర కారం పేస్ట్ - 2 tsp
గరం మసాల పొడి - 1 tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్ - 2 tsp
ఎర్ర కారం - 1 tsp
పసుపు - ½tsp
ఉప్పు - రుచికి సరిపడా
టమోటో కెచప్ - 4 tsp
సోయా సాస్ - 1tsp
రెడ్ చిల్లీ షేజ్వాన్ సాస్ - 4tsp
నిమ్మకాయ రసం - 2 tsp
వినెగార్ - 1 tsp
కార్న్ ఫ్లోర్ - 1tsp
ఆయిల్ - 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మందపాట పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనే వేసి కాగిన తర్వాత అందులో కరివేపాకు వేసి ఒక నిముషం వేగనివ్వాలి.
2. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. వెంటనే గరం మసాలా పౌడర్ కూడా వేసి వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులో ఉల్లిపాయముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరో నిముషం వేగించుకోవాలి.

4. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు రెడ్ చిల్లీ పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఆ తర్వాత అన్ని రకాల సాస్, (సోయా సాస్, టమోటో కెచప్, రెడ్ చిల్లీ షేజ్వాన్ సాస్)కూడా వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు పెప్పర్ పౌడర్, పసుపు, మరియు ఉప్పు వేసి మరో నిముషం వేగించుకోవాలి. తర్వాత అందులో వెనిగర్ మరియు నిమ్మరసం వేసి వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు మష్రుమ్ ను రెండు గా కట్ చేసుకోవాలి. అలాగే బేబీ కార్న్ కూడా మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఉడుకుతున్న గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరో పది నిముషాలు ఉడికించుకోవాలి.
8. పది నిముషాల తర్వాత మూత తీసి అందులో కార్న్ ఫ్లోర్ మరియు కొద్దిగా నీరు వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి . గ్రేవీ మొత్తం చిక్కగా రెడీ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.

Spicy Mushroom And Baby Corn Curry Recipe

9. ఈ మొత్తం మిశ్రమాన్ని సర్వింగ్ డిష్ లో పోసి , తర్వాత కొత్తిమీర తరుగును చిలకరించాలి. ఈ అద్భుతమైనటువంటి ఇండియన్ మష్రుమ్ మరియు బేబీకార్న్ రిసిపి రెడీ..

న్యూట్రిషియన్ విలువలు: మష్రుమ్ అండ్ బేబీకార్న్ ఆరోగ్యానికి ఒక బూస్ట్ వంటది. ఫుల్ ఎనర్జీని అందిస్తాయి. మష్రుమ్ లో ఐరన్ మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. అలాగే బేబీకార్న్ లో విటమిన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

English summary

Spicy Mushroom And Baby Corn Curry Recipe

A perfect recipe for every mushroom lover! With the twist of Indian masalas, this mushroom and baby corn recipe is a wholesome spicy treat - an indulgent sin you must try. Let's get going with today's simple Indian recipe of spicy masala mushroom curry with baby corn. Time to ring the hunger bells!
Story first published: Tuesday, December 9, 2014, 12:27 [IST]
Desktop Bottom Promotion