For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ పెప్పర్ మష్రుమ్ డ్రై ఫ్రై రిసిపి: తెలుగు

|

మష్రుమ్ కు సంబంధించిన అన్ని రకాల వంటలు పిల్లలు మరియు పెద్దలకు చాలా ఇష్టమైన వంట. ఇంకా శాఖాహారుల కూడా దీన్ని ఎక్కువగా తింటారు. మష్రుమ్ కు కొద్దిగా మసాలా జోడించి చేయడం వల్ల అచ్చం నాన్ వెజ్ వంటలాగే, ఫ్లేవర్, మరియు రుచి కలిగి ఉంటుంది. ముఖ్యంగా మష్రుమ్ పెప్పర్ ఫ్రైకు మసాలా దినుసులు జోడించడం వల్ల చాలా గ్రేట్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది.

పెప్పర్ ఫ్రై ఒక ఇండియన్ మసాలా దినుసుతో తయారుచేస్తాం. కారం, క్యాప్సికమ్, క్యాప్సికమ్ చేర్చడం వల్ల స్పైసీగా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది . మష్రుమ్ పెప్పర్ ఫ్రై తయారుచేయడం చాలా సులభం మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ స్పెషల్ మష్రుమ్ పెప్పర్ ఫ్రై టేస్ట్ చూడాలంటే, ఎలా తయారుచేయాలో చూద్దాం... రండి....

Spicy Pepper Mushroom Dry Fry Recipe in Telugu

Serves: 3
Cooking Time: 18 minutes
Preparation Time: 10 minutes

కావల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
మష్రుమ్: 1cup(చిన్న ముక్కలుగా తరిగినవి)
వెల్లుల్లి: 1tsp
Pepper: 2 tsp
కారం Flakes: 1 tsp
కాప్సికం : 1 (చిన్న ముక్కలుగా తరిగి)
ఆయిల్ : 2 tbsp
కొత్తిమిర తరుగు : కొద్దిగా

తయారుచేయు విధానం:

1. ఒక డీప్ పార్ లో కొద్దిగా నూనె వేసి, నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.

Spicy Pepper Mushroom Dry Fry Recipe in Telugu
2. తర్వాత అందులోనే సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలు ఫ్రై అయ్యే సమయంలో కొద్దిగా ఉప్పు చిలకరిస్తే త్వరగా ఫ్రై అవుతాయి.
3. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

Spicy Pepper Mushroom Dry Fry Recipe in Telugu
Spicy Pepper Mushroom Dry Fry Recipe in Telugu

4. క్యాప్సికమ్ ఫ్రై అవుతున్నప్పుడు, మద్యలో పెప్పర్ పౌడర్, కొద్దిగా ఉప్పు, కారం లేదా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
5. క్యాప్సికమ్ మరియు ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగిన తర్వాత పాన్ లో మష్రుమ్ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మీడియం మంట మీద మరికొద్దిపేపు ఫ్రై అవ్వనివ్వాలి.

Spicy Pepper Mushroom Dry Fry Recipe in Telugu
6. కొద్దిసేపటి తర్వాత మూత తీసిని మష్రుమ్ మెత్తగా ఉడికినట్లైతే, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

న్యూట్రీషియన్ చిట్కా: మష్రుమ్ (పుట్టగొడుగు)లో ఉండే చోలిన్ అనే కంటెంట్ చాలా ముఖ్యమైన పోషకాహారం. ఇది నిద్రపట్టేలా చేస్తుంది మరియు కండరాలను వదులు చేస్తుంది మరియు మెమరీ పవర్ పెంచుతుంది.

English summary

Spicy Pepper Mushroom Dry Fry Recipe in Telugu

Mushroom Pepper Fry in Telugu. Mushroom is an all time favourite for kids as well as adults. If you cook this fleshy veggie well, you will certainly enjoy it to the fullest. Adding spice to this dish will draw in a special flavour to your taste buds.
Desktop Bottom Promotion