For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ పెషావరీ చెనా(కాబూలీ శెనగల) మసాలా రిసిపి

|

చెనా (శెనగలు)తో తయారుచేసే వంటలు పంజాబ్ డిష్ లలో చాలా పాపులర్ అయినటువంటివి .మన దేశంలో వివిధ ప్రదేశాల్లో చాలా పాపులర్ అయినటువంటి వంట. శెనగలతో తయారుచేసే వంటలు కర్రీ, గ్రేవీలు, మరియు రైస్ కు, రోటీలకు సైడ్ డిష్ లుగాను తయారుచేసుకుంటారు. ఇంకా శెనగలను ఉడికించి పరోటాలకు స్టఫింగ్ గా కూడా ఉపయోగిస్తుంటరు. అయితే చెనా బతురా కూడా నార్త్ ఇండియన్ సైడ్ చాలా ఫేమస్ అయిన వంటకం.

కాబూళీ చెన్నాను తయారుచేయడానికి వివిధ మార్గాలున్నాయి, అయితే పెషావరి చెన్నాఏసందర్భానికైనా సూట్ అయ్యే ఓ ఫేవరెట్ రిసిపి. ఇది పంజాబి ఫుడ్ లవర్స్ కు మరింత ఇష్టమైన వంట. దీన్ని ఉడికించి శెనగలతో తయారుచేస్తారు. అలాగే, ఇండియన్ మసాలాలు మరియు వెజిటేబుల్స్ తో తయారుచేసే ఈ రుచికరమైన వంట మీకు కూడా నచ్చవచ్చు. కాబట్టి, ఒక సారి ట్రై చేయండి.

Spicy Peshawari Chana Masala Recipe

కావల్సిన పదార్థాలు:
చనా-2 cups
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 2 (చిన్న ముక్కలుగా లేదా తురుముకోవాలి)
అల్లం: 1 అంగుళం (తురుముకోవాలి)
వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి: 4-5 (మద్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి : ½tsp
చనా మసాలా: 1tsp
గరం మసాలా: ½tsp
జీలకర్ర పొడి: 1tsp
బే ఆకు 1
రెడ్ చిల్లీ పౌడర్ -1 tsp
డ్రై రెడ్ చిల్లి: 1
టీ బ్యాగ్స్: 2
నూనె: 2tbsp
ఉప్పు 2tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp (సన్నగా కట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా శెనగలను శుభ్రంగా కడిగి రాత్రంతా నీటిలో వేసి నానబెట్టుకోవాలి.
2. తర్వాత రోజు ఉదయం వాటిని మరోసారి శుభ్రంగా కడిగి తర్వాత ప్రెజర్ కుక్కర్ లో వేసి నీళ్ళు పోసి తర్వాత అందులోటీ ఆకులను వేయాలి. అలాగే కొద్దిగా ఉప్పును చిలకరించి,3-4విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ప్రెజర్ తగ్గే వరకూ అలాగే ఉంచాలి.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్ది నూనె వేసి అందులో బిర్యానీ ఆకు మరియు ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, టమోటో ముక్కలు వేసి మరో నిముషం మీడియం మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు , పసుపు, కారం, చనా మసాలా మరియు ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత టీవాటర్ తో సహా ఉడికించుకొన్న చెనా కూడా అందులో ఈ ఫ్రైయింగ్ మిశ్రమంలో వేయాలి.
5. తర్వాత కుక్కర్ లో నీళ్ళు ఎక్కువగా ఉంటే, పాన్ లో కొద్దిగా అవసరం అయితేనే వేసుకోవాలి . తర్వా తమీరు డ్రై లేదా రెడ్ చనా మసాలాను వేసి బాగా మిక్స్ చేసి చిక్కగా ఉడికించుకోవాలి. అంతే పెషావరి చెనా మసాలా రిసిపి రెడీ. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి ఈ స్పైసీ మరియు డెలిషియస్ డిష్ ను రోటీ, పులావ్ లేదా టిక్కీతో సర్వ్ చేయాలి.

English summary

Spicy Peshawari Chana Masala Recipe

Chana (chickpeas in English) is a very popular Punjabi dish. This spicy dish has become very famous in many parts of the country. Also known as chola, chana can be used as a side dish with rice, roti or as a topping over chana tikki chaat. You can even boil chana and use it as a stuffing for your parathas. However, chana bhatura is a very famous combination in north India.
Story first published: Monday, May 26, 2014, 12:15 [IST]
Desktop Bottom Promotion