For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోబి తందూరి: హాట్ అండ్ స్పైసీ

|

కాలీఫ్లవర్ గ్రీన్ వెజిటేబుల్స్ లో హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ . ఆరోగ్యం మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకొనే వారు, కాలీఫ్లవర్ వారంలో కనీసం ఒక సారైనా తీసుకుంటుంటారు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాలీఫ్లవర్ తందూరి ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది చాలా అద్భుతమైన రుచికలిగినటువంటి వెజిటేరియన్ రిసిపి. దీన్ని చాలా సులభంగా తయారుచేయవచ్చు.

ఈ కాలీఫ్లవర్ రోస్ట్ కు కొన్ని వండర్ ఫుల్ మాసాలా దినుసులతో మ్యారినేట్ చేసి తర్వాత బేక్ చేస్తారు. ఆరోమా వాసనతో రుచికరంగా, బ్రౌన్ గా ఉండే తందూరి గోబి మీరు కూడా టేస్ట్ చేయాలంటే తయారుచేసే పద్దతిని వాటికి కావల్సిన పదార్థాలను క్రింది విధంగా ఉన్నాయి పరిశీలించండి...

Spicy Tandoori Gobi Recipe


కావల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్- 1 (whole)
పనీర్- 250 gms (crumbled)
పెరుగు- 2tbsp
నూనె- 1tbsp + 2tbsp
నిమ్మరసం- 2tbsp
కారం- 1tsp
అల్లం- 1tsp (chopped)
ఎండుద్రాక్ష- 8

గర్భిణీ స్త్రీలకు కాలీఫ్లవర్ తో అత్యుత్తమ ప్రయోజనాలు


గరం మసాలా పౌడర్- 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
దాల్చిన చెక్క- 2 sticks
గ్రీన్ యాలకలు- 3
బ్లాక్ యాలకలు- 1
లవంగాలు- 3
బిర్యానీ ఆకు- 2
కొత్తిమీర- 2tbsp (chopped)

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్లో 3కప్పుల నీరు పోసి వేడి చేయాలి. తర్వాత అందులో ఉప్పు, దాల్చిన చెక్క, గ్రీన్ అండ్ బ్లాక్ యాలకలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి బాగా మరిగిన తర్వాత ఆ నీటిలోనే శుభ్రం చేసి పెట్టుకొన్న కాలీఫ్లవర్ కూడా వేసి బాయిల్ చేయాలి.
2. మూత పెట్టి 10నిముషాల పాటు కాలీఫ్లవర్ ను మీడియం మంట మీద ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ బాగా మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.
3. అంతలోపు ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్, పెరుగు, నూనె, నిమ్మరసం, అల్లంతురుము, కారం, ద్రాక్ష, గరం మసాల, మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి.

వింటర్ స్పెషల్ : కాలీఫ్లవర్ తో వెరైటీ వంటలు

4. కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టి, చల్లారనివ్వాలి.
5. తర్వాత పనీర్ మసాలాను ఉడికించిన కాలీఫ్లవర్ మీద చిలకరించి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి.
6. తర్వాత కొద్దిగా నూనె పాన్ లో వేసి వేడి అయ్యాక కాలీఫ్లవర్ ను వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోవచ్చు లేదా డీఫ్ ఫ్రై చేసుకోవచ్చు. అంతే తందూరి కాలీఫ్లవర్ రిసిపి రెడీ . చివరగా కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

English summary

Spicy Tandoori Gobi Recipe

Spicy Tandoori Gobi Recipe, Tandoori Gobi serves as a great starter or even as a snack. This recipe is made without oil so its good for those who are on dieting. Here is an easy recipe of Tandoori Gobhi.
Story first published: Tuesday, February 2, 2016, 17:33 [IST]
Desktop Bottom Promotion