For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ టమోటో సాంబార్ రిసిపి: లచ్ రిసిపి

|

టమోటో తయారు చేసే కొన్ని వంటలు చాలా అద్భుతంగా మంచి టేస్ట్ ఉంటాయి. అన్నం, దోసెలోనికి రొటీన్ చట్నీ, సాంబార్లు తిని బోర్ కొడుతుంటే కొంచెం వెరైటీగా టమోటో కుర్మా చేసి టేస్ట్ చేయండి. టమోటో కుర్మా బాగా ప్రజాదరణ పొందిన సౌత్ ఇండియన్ రిసిపి. ఇది రైస్ లేదా దోసె లేదా ఏదైని సైడ్ డిష్ గా ఇది బాగా సూట్ అవుతుంది. ఈ టమోటో కుర్మా చట్నీ కాదు అలా అని సాంబారూ కాదు. ఇది టమోటోలతో తయారు చేసే ఒక సాధారణమైన కర్రీ .

దక్షిణ భారత దేశ వంటకాల్లో ఉపయోగించే కొన్ని ఘాటైన మసాలా దినుసులు ఉపయోగించి తయారు చేసే టమోటో కుర్మా . దీనికి కొద్దిగా కొబ్బరి మరియు ఎక్కువగా కరివేపాకు చేర్చడం వల్ల మరింత అద్భుతమైన టేస్ట్ ను అందిస్తుంది. మరి మీరు ఈ టమోటో కుర్మాను టేస్ట్ చేస్తారు కదూ....

Spicy Tomato Sambar Recipe For Lunch

కావల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు: 1/2(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటోలు: 4(గుజ్జు)
కారం: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
శెనగపప్పు: 1/4 tsp
ఉద్దిపప్పు: 1/4 tsp
ఆవాలు: 1 tsp
కరివేపాకు: 4
కొత్తిమీర: 1కట్ట

పేస్ట్ చేయడానికి అవసరం అయినవి:
లవంగాలు: 3
దాల్చిన చెక్: 1
సోంపు: 1/4 tsp
గసగసాలు: 1/2 tsp
ధనియాలు: 1 tsp
వెల్లుల్లి రెబ్బలు: 3
అల్లం: చిన్న ముక్క
కొబ్బరి తురుము: 7 tbsp (or) 1/2 cup
టమోటోలు: 2(పెద్దవి)

తయారుచేయు విధానం:
1. మిక్సీలో పేస్ట్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని వేసి, మొత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసుకొని వేడయ్యాక, అందులో ఆవాలు వేసి వేగిన తర్వాత అందులో ఉద్దిపప్పు మరియు శెనగపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో ఉల్లిపాయలు, టమోటో గుజ్జు, కరివేపాకు మరియు కొత్తిమీర వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకొన్నమసాలను ఫ్రైయింగ్ పాన్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు మరియు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని 10-15నిముషాలు ఉడికించుకోవాలి.
6. తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపుకొని, వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.

English summary

Spicy Tomato Sambar Recipe For Lunch

Spicy Tomato Sambar Recipe For Lunch
Story first published: Thursday, February 5, 2015, 13:33 [IST]
Desktop Bottom Promotion