For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొలకల పులావ్ - హార్ట్ హెల్తీ రిసిపి

|

టెన్షన్, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకుండుట మరియు అనారోగ్యకరమైన జీవన శైలి. ఇవన్నీ కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. ముఖ్యంగా గుండె మరియు ఇతర సమస్యలుకు దారితీస్తుంది. ప్రస్తు కాలంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి రోజూ మనం ఏం చేస్తున్నాం, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము అన్నవిషయాల మీద శ్రద్ద పెట్టలేకపోతున్నాం. చాలా వరకూ గుండె సమస్యలు హైబిపి మరియు కొలెస్ట్రాల్ వంటివి అనారోగ్యరమైన ఆహారపు అలవాట్ల వల్లే వస్తుంది.

మన తీసుకొనే ఆహారం మీద శ్రద్ద పెట్టడం కొంచెం కష్టమైనా, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులను దూరంగా ఉంచవచ్చు . హెల్తీ ఈటింగ్ కోసం ఒక్కడ ఒక ఆహారం స్ప్రాట్స్ పులావ్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా హార్ట్ పేషంట్స్ కు చాలా ఆరోగ్యకరమైన ఆహారం ఇక మిగిలిన వారు తీసుకోవడం వల్ల హార్ట్ కు సంబంధించి జబ్బుల రాకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ రిసిపికి ముఖ్యంగా బ్రౌన్ రైస్ మరియు మొలకలను ఉపయోగించడం వల్ల కలర్ ఫుల్ గా ఉంటుంది. ఆరోగ్యకరం మరియు కడుపు ఫుల్ గా ఉండేట్లు చేస్తుంది. ఇది చాలా రుచికరమైనది. అంతే కాదు ఈ ఫుడ్ లచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ మొలకల పులావ్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Sprouts Pulao: Heart Healthy Recipe

మాత్ బీన్స్ (matki): ½cup(మొలకకట్టినవి)
ముడి పెసళ్ళు :½cup(మొలకొచ్చినవి మరియు ఉడించుకోవాలి)
బ్రౌన్ బియ్యం : 2 cups(అన్నంవండుకోవాలి)
కాప్సికమ్:1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఫ్రెంచ్ బీన్స్: 4 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
టమోటాలు:2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ :1 (సన్నగా, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం: 1 (చిన్న ముక్కలుగా తరిగుకోవాలి లేదా కచాపచా దంచి పెట్టుకోవాలి)
వెల్లుల్లి పాయలు: 3-4 (చిన్న ముక్కలుగా తరిగుకోవాలి లేదా కచాపచా దంచి పెట్టుకోవాలి)
పసుపు: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: ½tsp
ధనియాలపొడి: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడిచేయాలి. తర్వాత అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
2. తర్వాత అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి 2నిముషాలు వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్ని ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్, ఉప్పు వేసి వేగించాలి.
4. తర్వాత టమోటోలు, పసుపు, జీలకర్రపొడి, ధనియాల పొడి, కారం వేసి మీడియం మంట మీద వేగిస్తూ, ఉడికించుకోవాలి.
5. టమోటో మెత్తబడ్డాక అందులో మొలకలు మరియు ముడి పెసలు వేసి బాగా మిక్స్ చేసి 5 నిముషాలు ఉడకనివ్వాలి.
6. తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న బ్రౌన్ రైస్ అన్నం ను కూడా వేసి మిక్స్ చేయాలి.
7. టేస్ట్ కు సరిపడా ఉప్పు చేర్చాలి. తిరిగా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

అంతే ఆరోగ్యకరమైన స్ప్రౌట్స్(మొలకల) పలావ్ రెడీ. ఈ రుచికిరమైన మీకు నచ్చిన సైడ్ డిష్ తో పాట్ సర్వ్ చేయాలి.

English summary

Sprouts Pulao: Heart Healthy Recipe


 Tension, stress, bad eating habits, lack of exercise and an unhealthy lifestyle. All of these factors have contributed to increase in heart diseases and various other complications.
Story first published: Thursday, September 26, 2013, 11:44 [IST]
Desktop Bottom Promotion