For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూజి చిల్లా రిసిపి : గ్రేట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే, ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ రిసిపిని ఏమని ఆలోచిస్తుంటాము. సాధారణంగా రెగ్యలర్ గా తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ రిసిపికి, కాస్త వెరైటీగా చేసుకుంటే, తినడానికి ఉత్సాహంగా ఉంటుంది.

అలాంటి స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలలో ఒకటిసూజి చిల్లా. దీన్ని ఇన్ స్టాంట్ దోసెఅని కూడా అనవచ్చు. ఎందుకంటే, అప్పటికప్పుడు పిండిని తయారుచేసుకొని తయారుచేసే సులభమైన మరియు త్వరగా తయారుచేసుకొనే ఉత్తమ అల్పాహారం. ఇందులో వెజిటేబుల్స్ , పచ్చిమిర్చి చేర్చడం వల్ల వెరైటీ టేస్ట్ కలిగి ఉంటుంది. క్రిస్పీగా ఉంటుంది . అంతే కాదు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు చర్మానికి చాలామంచిది మరియు బరువు తగ్గడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Suji Chilla Recipe For A Great Morning

కావల్సిన పదార్థాలు:
రవ్వ: 2 cups
పెరుగు: 1 cup
నీళ్ళు: ½ cup
వెజిటేబుల్స్: 1 cup (ఉల్లిపాయల, క్యాప్సికమ్, టమోటో, క్యారెట్, పచ్చిబఠానీలు)
కొత్తిమీర తరుగు : కొద్దిగా
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా
పెప్పర్: చిటికెడు
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా రవ్వ, పెరుగు, మరియు కొద్దిగా నీరు ఒక బౌల్లోపోసి, బాగా మిక్స్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. ఒకటి లేదా రెండు గంటల తర్వాత అందులో వెజిటేబుల్స్ మరియు కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
3. గరిటతో బాగా మిక్స్ చేసి, తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడుఅందులో రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి.
5. ఇలా పిండిని తయారుచేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె రాసి వేడి చేయాలి.
6. ఇప్పడు పిండిని కొద్దిగా తీసుకొని తవా మీద దోసెలా వేసుకోవాలి.వేసుకొన్న తర్వాత రెండువైపుల బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి. అంతే క్రిస్పీ సూజీ చిల్లీ రిసిపి రెడీ

English summary

Suji Chilla Recipe For A Great Morning

Each morning when you wake the first thing which comes to one's mind is - what to prepare for breakfast. With this yummy suji chilla recipe Boldsky shares with you, it will only come of a surprise as to how easy it is to prepare a dish in such little time.
Story first published: Saturday, January 10, 2015, 10:15 [IST]
Desktop Bottom Promotion