For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాచులర్స్ కోసం స్వీట్ & హాట్ నూడిల్స్-బ్రేక్ ఫాస్ట్

|

ప్రతి రోజూ ఉదయం లేవగానే మనస్సులో మొదట మెదిలేది, ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ గా ఏం తినాలి అని? ఈ రోజూ మీ బ్రేక్ ఫాస్ట్ కోసం ఒక స్పెషల్ ఎక్స్ ట్రాడినరీ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ ను మీకు అంధిస్తున్నాం. ఈ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ రుచికిరమైన మరియు కొంచెం తీపి, కొంచెం కారంగా మరియు వేడివేడిగా మీరు తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది?. ఉదయం మీ దినచర్యను ఈ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ తో మొదలుపెడిగే మీ నోటికి రోజంతా మరవలేని ఓ అద్భుతమైన టేస్ట్ మీ నాలుక మీద మెదలాడుతూనే ఉంటుంది....

ట్యాంగీ అండ్ స్వీట్ మాడ్ నూడిల్స్ రిసిపి ఈ రోజు తయారుచేయడానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేటంటే, బ్యాచులర్ గా ఉండేవారు, ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉంటూ గడిపేవారు, ఒక కొత్త రుచిని టేస్ట్ చేయడానికి నూడిల్స్ రిసిపి తయారుచేయబడింది. మీరు బ్యాచులర్ అయినట్లైతే, ఒంటరిగా జీవిస్తున్నట్లైతే ఈ న్యూడిల్స్ మీకు ఓ అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ . దీన్ని తయారుచేయడం చాలా సులభం. మరియు చాలా తక్కువ సమయం పడుతుంది. మరికెందుకు ఆలస్యం తయారుచేయడం మొదలెట్టండి...

Sweet N Hot Noodle Recipe For Bachelors

కావల్సిన పదార్థాలు:
న్యూడిల్స్: 5grms
ఉల్లిపాయలు: 1(సన్నగా తరిగిపెట్టుకవాలి)
టమోటో: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పంచదార: 1/2tsp
పచ్చిబఠానీ: 2tbsp
క్యారెట్: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
సోయాసాస్: 1tsp
నిమ్మరసం: 1/2tsp
పచ్చిమిర్చి: 1(మద్యకు కట్ చేయాలి)
నీళ్ళు: 1cup
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనెవేసి, మీడియం మంట మీద వేడి చేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు, వేసి ఉల్లిపాయ ముక్కలతో పాటు వేగించుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగేవరకూ వేగించాలి.
3. తర్వాత అందులోనే కట్ చేసిన టమోటో ముక్కలు, కూడా వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి. ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
4. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు పోసి 5 నిముషాలు బాగా మరిగించాలి .
5. నీరు బాగా మరిగేటప్పుడు పచ్చిబఠానీలు మరియు క్యారెట్ ముక్కలు కూడా వేసి మరో 5నుండి 10 నిముషాలు ఉడికించుకోవాలి.
6. తర్వాత అందులో నూడిల్స్ ను వేసి బాగా మిక్స్ చేస్తూ ఉడికించాలి. అవసం అయితే మరికొద్దిగా నీళ్ళు మిక్స్ చేయవచ్చు.
7. నూడిల్స్ మెత్తగా ఉడికుతున్నప్పుడు, అందులో పంచదార చిలకరించి బాగా ఉడికించాలి.
8. ఇప్పుడు పాన్ కు మూత పెట్టి, ఆవిరి మీద బాగా ఉడికేలా చేయాలి.
9. 5నిముషాల తర్వాత మూత తీసి సోయా సాస్ మరియు నిమ్మరసం జోడించి బాగా మిక్స్ చేయాలి. అంతే నూడిల్స్ సాఫ్ట్గ్ గా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, స్వీట్ అండ్ హాట్ నూడిల్స్ ను తినేయండి. దీనికి గార్లిక్ సాస్ లేదా టమోటో సాస్ బెస్ట్ కాంబినేషన్.

English summary

Sweet N Hot Noodle Recipe For Bachelors

Each morning when you wake up, there is always a thought in your head as to what to eat for breakfast. Today, we would like you to try out something out of the extraordinary.
Desktop Bottom Promotion