సంక్రాంతి స్పెషల్: తీపి గుమ్మడి పల్యా

Posted By: Lekhaka
Subscribe to Boldsky

భారతదేశంలో ఒక్కో పండుగకి ఒక్కో రాష్ట్రంలో ఒక ప్రత్యేక వంటకం చేస్తారు. బెంగాలీలు మకర సంక్రాంతికి మన బొబ్బట్ల వంటి పీటా తయారు చేస్తే కర్నాటక వాళ్ళు పాల్యాలని తయారు చేస్తారు.ఈ వంటకాన్ని కర్నాటక వాసులు సంక్రాని రోజున బంగాళదుంప లేదా తీపి గుమ్మడితో తయారు చేస్తారు.దీనిలో వారు కొబ్బరి కూడా చాలా కలుపుతారు.

ఈ తీపి గుమ్మడి పాల్యా తయారీకి కావాల్సిన పదార్ధాలు సులువుగా దొరికేవే పైగా దీని తయారీ కూడా చాలా సులభం.మరి ఈ మకర సంక్రాంతికి మీ ఇంట్లో ఇది తయారు చెయ్యాలనుందా?? అయితే ఈ వంటకానికి కావాల్సిన పదార్ధాలు, దీని తయారీ విధానం చూద్దాము.

ఎంత మందికి సరిపోతుంది-2

ప్రిపరేషన్ టైం-10 నిమిషాలు

కుకింగ్ టైం-15 నిమిషాలు

Sweet Pumpkin Palya For Sankranti

కావాల్సిన పదార్ధాలు:

1.తీపి గుమ్మడి-సన్నగా తరిగినది ఒకటిన్నర కప్పు

2.ఎండు మిర్చి-2

3.పచ్చి మిర్చి-2

4.తాజాగా తురిమిన కొబ్బరి-1/2 కప్పు

5.కొత్తిమీర-సన్నగా తరిగినది 2-3 కట్టలు

6.నూనె-3 టీ స్పూన్లు

7.ఉప్పు-రుచికి తగినంత

పోపు కోసం:

8.ఆవాలు-2 టీ స్పూన్లు

9.మినపప్పు-2 టీ స్పూన్లు

10.ఇంగువ-చిటికెడు

11.శనగ పప్పు-2 టీ స్పూన్లు

12.కరిపేవాపు-4-5

13.పసుపు-1/4 టీ స్పూను

తయారీ విధానం:

1.తీపి గుమ్మడి చెక్కు తీసి , దానిలో గింజలు తీసేసి సన్నటి ముక్కలుగా తరగాలి.

2.ఒక మూకుడు తీసుకుని దానిలో నూనె వేసి వేడెక్కాకా ఆవాలు,శనగ పప్పు, ఇంగువ, పసుపు వేసి పచ్చి మిర్చీ, ఎండు మిర్చీ వేసి ఒక 30 సెకన్లు వేగనివ్వాలి.

3.పోపులో పప్పులు రంగు మారుతుండగా తరిగిన గుమ్మడి ముక్కలు వేసి కాసిని నీళ్ళూ చేర్చి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి.

4.ఒక 5 నిమిషాల తరువాత మూత తీసి గుమ్మడి ఉడికిందేమో చూసి ఉప్పు వేసి బాగా కలపాలి.

5.దీనిలో కొత్తిమీర తరుగు, తాజా కొబ్బరి వేసి అన్నీ కలిసేటట్లు కలపాలి.

6.అంతే తీపి గుమ్మడి పాల్యా తయారయిపోయింది. దీనిని వేడి వేడిగా అన్నంతో కానీ చపాతీలతో కానీ కలిపి వడ్డించండి.

English summary

Sweet Pumpkin Palya For Sankranti

Here is the simple recipe of the sweet pumpkin palya that you could prepare for the occasion of Makara Sankranti/Pongal.
Please Wait while comments are loading...
Subscribe Newsletter