For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శెనగల కర్రీ- శ్రావణ మాసం స్పెషల్

|

మన ఇండియన్ కుషన్స్ లో వివిధ రకాల వంటలు నోరూరిస్తుంటాయి. అద్భుతమైన రుచిగల వంటలు ఒకటి కాదు రెండు కాదు, చెప్పడానికి వీలులేనన్ని ఉంటాయి. మన ఇండియాలో ఆయా ప్రదేశాల్లో, ఆయా స్టేట్స్ లో ప్రత్యేకమైన వంటలుంటాయి. అటువంటి రుచికరమైన వంటల్లో శెనగలతో తయారుచేసే వంటలు మన ఆంధ్రాలో కూడా చాలా ఫేమస్.

శెనగలను చోలే లేదా చెన లేదా చిక్ పీస్ గా పిలుస్తుంటారు. వీటితో తయారు చేసే వంటలంటే చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టమే. రెగ్యులర్ వెజిటేబుల్స్ తో బోరు కొట్టినప్పుడు కొంచెం రుచి మార్చడానికి మరియు శ్రావణమాసంలో వర్షకాలంలో, ఆరోగ్యకరంగా మరియు రుచికరంగా ఉండటానికి శెనగలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది హై న్యూట్రీషియన్ ఫుడ్ . కాబీళీ చెన్న హార్ట్ పేషంట్లకు కూడా చాలా ఆరోగ్యకరమైనది ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మరియు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ శెనగలతో తయారుచేసే కర్రీ డిఫరెంట్ టేస్ట్ తో మీకోసం ఒక వంట...

Tasty Chana Curry Recipe: Shravanam Special

కావల్సిన పదార్థాలు:
శెనగలు: 1cup
పసుపు: 1/2tsp
ఉల్లి తరుగు: 1/2cup
చిన్న ఉల్లిపాయలు: 4-6
పచ్చి మిర్చి: 3 (పొడవుగా మధ్యకు కట్ చేయాలి)
కరివేపాకు: 4 రెమ్మలు
కారం: 1tsp
ఎండు మిర్చి: 2
కొబ్బరి తురుము: 1/2cup
చిన్న ఉల్లిపాయలు: 2(సన్నగా తరగాలి)
ధనియాలు: 2tbsp(ధనియాల పొడి కూడా వాడుకోవచ్చు)
మసాలా కోసం:
సోంపు: 1/2tsp
ఏలకులు: 2
లవంగాలు: 3
దాల్చినచెక్క: చిన్న ముక్క
మిరియాలు: నాలుగు గింజలు

తయారు చేయు విధానం:
1. ముందుగా శెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి.
2. మరుసటి రోజు ఒక గిన్నెలో... నానబెట్టిన సెనగలు, ఉప్పు, పసుపు వేసి కుకర్‌లో ఉడికించాలి(ఉడికించిన నీళ్లను పక్కన ఉంచి, గ్రేవీ కోసం వాడుకోవచ్చు)
3. ఇప్పుడు పాన్ లో ఒక చెంచా నూనె వేసి కాగిన తర్వాత అందులో ధనియాలతో పాటు మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి వేయించాలి
4. చిన్న ఉల్లిపాయల తరుగు జత చేసి బాగా వేయించాక, కొబ్బరి తురుము వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, దించి చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
5. తర్వాత మరొక పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి కాగాక అందులో ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి.
6. వెంటనే ఉల్లి తరుగు, చిన్న ఉల్లిపాయల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి.
7. ఇప్పుడు పసుపు, కారం జత చేసి కొద్ది సేపు వేయించి, ఉడికించి ఉంచుకున్న నీళ్లు పోసి, మరిగాక కొబ్బరి పేస్ట్, ఉడికించిన శెనగలు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. అంతే శెనగల కర్రీ రెడీ. ఇది శ్రావణ మాసం యొక్క స్పెషల్ కర్రీ.

English summary

Tasty Chana Curry Recipe: Shravanam Special

We Indians are always up for a delectable treat of chole bhatura. This delicious combo is a sensation all over India, irrespective of the regions. Chole or chana or chickpeas curry is a favourite dish of almost everyone and the kids simply love it. It is also the best option when you are bored of the regular veggies and want a change of taste.
Story first published: Tuesday, August 12, 2014, 12:16 [IST]
Desktop Bottom Promotion