For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ దాల్ కా పరాఠా రిసిపి: ఈవెనింగ్ స్పెషల్

|

ఈవెనింగ్ టైమ్ లో ఏదైనా హెల్తీగా తినాలని కోరుకుంటున్నారా? ఆకలి భోరుమన్నప్పుడు మామూలు రోటీ బోరు అనిపించినప్పుడు...మరోటీ మరేదయినా మంచి వెరైటీ తినాలినిపిస్తే..పరాఠాలు ట్రై చేయండి. రోటీలో రారాజు పరాఠా..రుచికి రుచి, ఒంటికింత పుష్టి...కొన్ని రకాల రోఠీలు ఆకలి తీర్చుతాయి..మరికొన్నేమో ఆకలిని పెంచుతాయి...ఒకసారి రుచి చూశారంటే మరోటీ..మరోటీ..కావాలంటారు. మరి ఆ మరోఠీ దాల్ పరోఠా.. బరువు తగ్గించే మహారాజు..రోటీలలో రారాజు పరాఠా..

దాల్ పరోటా రిసిపి నార్త్ ఇండియన్ వెజిటేరియన్ రిసిపి, దీన్ని ముఖ్యంగా గుజరాతీయులు ఎక్కువగా వండుతుంటారు. ఈ పరోటాకు గోధుమ పిండితోపాటు, వివిధ రాకాల మసాలా దినుసులు వేసి తయారు చేస్తారు. అతి సులభంగా తయారు చేసే రిసిపీలలో దాల్ పరోటా చాలా ప్రసిద్ది . మరి ఈ హెల్తీ దాల్ పరోటా ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం...

Tasty Dal Ka Paratha:Evening Special

కావలసిన పదార్థాలు :
గోధుమపిండి : కప్పు
ఉప్పు : కొద్దిగా నూనె : 2 టీ స్పూన్లు

ఫిల్లింగ్ కోసం...:
పెసలు : అర కప్పు (సుమారు రెండు గంటలు నానబెట్టాలి)
నూనె : 2 టీ స్పూన్లు
జీలకర్ర : అర టీ స్పూను
ఇంగువ : చిటికెడు
ఉప్పు : తగినంత
పసుపు : కొద్దిగా
కారం : అర టీ స్పూను
నెయ్యి :తగినంత

తయారుచేయు విధానం:

1. ఒక పాత్రలో గోధుమపిండి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, కొద్దిగా నూనె జత చేసి బాగా కలిపి, పక్కన ఉంచాలి.
2. పెసలు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి, కప్పుడు నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి .
3. బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేగాక, ఉడికించిన పెసలు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి, నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచి దించి, చల్లారాక, చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.
4. చపాతీపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ ఒత్తి, మధ్యలో పెసరపిండి మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, పరాఠాలా ఒత్తాలి
5. స్టౌ మీద పెనం ఉంచి కాగాక కొద్దిగా నెయ్యి వేసి, కరిగాక ఒత్తి ఉంచుకున్న పరాఠా వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు రెండువైపులా కాల్చి తీసేయాలి. అంతే టేస్టీ దాల్ కా పరాఠా రిసిపి రెడీ.

English summary

Tasty Dal Ka Paratha:Evening Special


 Dal Paratha recipe is a North Indian Vegetarian Recipe, mainly prepared in Gujarat households. This paratha is prepared using wheat flour, carom seeds, moong dal & jeera and are known to be beneficial for the body. Dal Paratha, is a rich-breakfast that is easy to prepare and can also be eaten for lunch.
Story first published: Saturday, November 8, 2014, 13:22 [IST]
Desktop Bottom Promotion