For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ మసాలా దాల్ రిసిపి: రైస్ కాంబినేషన్

|

టేస్టీ మసాలా దాల్ (రుచికరమైన మసాలా పప్పు) లేదా దాల్ అని నార్త్ స్టేట్స్ లో విరివిగా పిలుస్తారు. ఆంధ్రాకుషన్స్ లో చాలా ఫేమస్ అయినటువంటి వంట. ముఖ్యంగా వేజిటేరియన్ స్పెషల్. వెజిటేరియన్ భోజన ప్రియుల ప్రతి రోజూ వారి భోజనంలో పప్పులేనిది ముద్దదిగదు. ఇది రుచికరమైన ఒక నార్మల్ దాల్ రిసిపి. ముఖ్యంగా ఇది స్పెషల్ సౌత్ ఇండియన్ దాల్ రిసిపి.

మసాలా పప్పు అనేది, ఇతర దాల్ రిసిలకు రిలేటెడ్ గానే ఉంటుంది. అయితే మసాలా పప్పు యొక్క టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మసాలా పప్పును తయారుచేయడం చాలా సులభం. అంతే కాదు, చాలా తక్కువ సమయంలో దీన్ని తయారుచేవచ్చు. దాల్ రిసిపిని రెండు రకాలుగా తయారుచేయవచ్చు. సాధారణ పప్పు ఒకటైతే, మరొకటి మసాలా పప్పు. మసాలా పప్పుకు కొన్ని ఇండియన్ మసాలా దినుసులను వినియోగించి తయారుచేస్తారు. మసాలా పప్పును రోటీ, రైస్, పరాఠాల్లోకి తీసుకుంటారు. ఈ పప్పును కూడా రెండు విధాలుగా తయారుచేస్తారు. కుక్కర్ లో అన్ని పదార్థాలను వేసి ఒకే సారి ఉడికించుకోవచ్చు. లేదా ఇలా దాల్ మాత్రమే ఉడికించి మిగిలిన పదార్థాలన్నింటితో ఫ్రై చేసుకోవచ్చు. మరి మీకు కూడా ఈ ఆంధ్ర స్టైల్ మసాలా పప్పును రుచిచూడాలి ఉందా...

Tasty Masala Dal Recipe

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు: 1cup
శెనగపప్పు: 1(1 గంట నీటిలో నానబెట్టాలి)
మసూర్ దాల్(కందిపప్పు): ½cup
ఉల్లిపాయ: 1 (పెద్దది, సన్నగా తరిగి పెట్టుకోవాలి తరిగిన)
టమోటో: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
హింగ్(ఇంగువ): చిటికెడు
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
జీలకర్ర: 1tsp (చూర్ణం)
ఎండు మిర్చి: 1 (మద్యకు కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
నీరు: 3cups
కొత్తిమీర తరుగు: 2tbsp (చిటికెడు తరిగిన)

తయారుచేయు విధానం:
1. ముందుగా పప్పును నీటిలో శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో అన్ని రకాల పప్పులను వేసి, సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద, నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. పప్పు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఆవిరి తగ్గే వరకూ అలాగే ఉండాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి అందులో ధనియాలపొడి, ఇంగువ, ఎండుమిర్చి వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 3,4 నిముషాలు వేగించుకోవాలి.
6. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు, మూడు నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత అందులో కట్ చేసిన టమోటో ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరో 4,5నిముషాలు వేగించుకోవాలి.
8. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమంలో ఉడికించుకొన్న పప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. సరిపడా ఉప్పు వేసి మరికొన్ని నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
9. పప్పు పూర్తిగా పోపుతో కలిసిపోయే పచ్చివాసన పోయే వరకూ ఉడికించి, స్టౌ ఆఫ్ చేసి పక్కకు దింపుకోవాలి అంతే టేస్టీ మసాలా దాల్ రిసిపి రెడీ .ఈ దాల్ రిసిపి వేడి వేడి అన్నంకు చాలా టేస్టీగా ఉంటుంది.

English summary

Tasty Masala Dal Recipe

Aren't you bored of eating the same plain dal everyday? So, add a little favour and spices to your boring dal and make it interesting. If you are wondering how to go about it, then we are here to help you out with that.
Story first published: Thursday, March 20, 2014, 12:41 [IST]
Desktop Bottom Promotion