For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ సేమియా బిర్యానీ : ఇండియన్ రిసిసి

|

సాధారణంగా సేమియా అంటేనే పాయసం గుర్తొస్తుంది. ఎందుకంటే సేమియా పాయసం అంటే అందరీకి ఇష్టం కనుక. సేమియా పాయసం లేనిదే ఏ పండుగ, శుభకార్యాలు జరగవంటే అతిశయోక్తి కాదు. సేమియాతో వివిధ రకాల వంటలు చేస్తారు. సేమియా ఉప్మా, సేమియా పాయసం... అందరికీ తెలిసిన స్వీట్ అండ్ టేస్టీ ఐటమ్స్!

READ MORE: స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ : సేమియా బిసిబేళబాత్

సేమ్ టు సేమ్ కాకుండా... సేమ్యాను ఇంకోరకంగా చేసుకోలేమా? కచ్చితంగా ప్రయత్నిస్తే ఓ కొత్త రుచిని చూడవచ్చు. సేమియా బిర్యానీ. సాధారణంగా బిర్యానీని బియ్యంతో తయారుచేస్తారు. రైస్ బిర్యానీ బోర్ అనిపించినప్పుడు ఇలా వెరైటీగా సేమియాతో ట్రై చేయవచ్చు. సేమియా బిర్యానీ తయారుచేయడం చాల సులభం. మరియు చాలా త్వరగా తయారుచేయవచ్చు. అంతే కాదు టేస్టీగా కూడా ఉంటుంది. సమయం లేనప్పుడు, అలసటగా ఉన్నప్పుడు, ఏదైనా టేస్టీగా తినాలనుకొన్నప్పుడు ఇది ఒక ఉత్తమ ఎంపిక...మరికెందుకు ఆలస్యం టేస్టీ సేమియా బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం....

Tasty Semiya Biryani: Indian Recipes-Telugu Recipes


కావల్సిన పదార్థాలు:
సేమియా - 1 cup
నీళ్ళు-1 ½ cup
ఉల్లిపాయలు - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ -3/4 tsp
పచ్చిమిర్చి -2
పుదీనా ఆకులు-10- 15

READ MORE:సేమియా పాయసం: రంజాన్ స్పెషల్

కొత్తిమీర - కొద్దిగా
మిక్స్డ్ వెజిటేబుల్స్ - 1 cup
కారం - 1 tsp
బిర్యానీ మసాలా -1 tsp
ఆయిల్- 1 tsp
దాల్చిన చెక్క -1
లవంగాలు-2
యాలకలు -1
బిర్యానీ ఆకు -1
ఉప్పు: రుచికి సరిపడా

READ MORE: ఈజీ సేమియా ఉప్మా: టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

తయారుచేసే విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి, అందులోసేమియా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అన్ని రకాల కూరగాయలను శుభ్రంగా కడిగి కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి.
3. కట్ చేసుకొన్న వెజిటేబుల్ ముక్కలను చిటికెడు ఉప్పు కొద్దిగా నీళ్ళు పోసి మీడియంగా ఉడికించి పెట్టుకోవాలి.
4. తర్వాత ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చినిసన్నగా కట్ చేసుకోవాలి.
5. అలాగే కొత్తిమీర మరిు పుదీనా కూడా సన్నగా కట్ చేసుకోవాలి..
6. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలలకు, బిర్యానీ ఆకు వేసి పచ్చివాసన పోయి, ఆరోమా వాసన వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
7.. తర్వాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకవోాలి,.
8. అదే పాన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 5నిముషాలు వేగించుకోవాలి.
9. అల్లం, వెల్లుల్లి వేగిన తరవ్ాత అందులో పుదీనా, మరియు కొత్తిమీర మరియు బిర్యానీ మసాలా వేసికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
10. తర్వాత వెజిటేబుల్స్ మరియు ఉప్పు పాన్ లో వేసి మొత్తం మసాలాలను మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. 5నిముషాల తర్వాత నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
10. నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులో ముందుగా వేగించుకొన్నసేమియా వేసి బాగామిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. సేమియా మెత్తగా ఉడికిన తర్వాత అందులో స్టౌ ఆఫ్ చేయాలి. సేమియా ఉడికేవరకూ మద్యమద్యలో కలియబెడుతుండాలి. అంతే వేడి వేడి సేమియా బిర్యాని రిసిపి రెడీ.

English summary

Tasty Semiya Biryani: Indian Recipes-Telugu Recipes

Tasty Semiya Biryani: Indian Recipes-Telugu Recipes, Biryani is usually made from rice. For a change if you are bored of rice or if you need a quick recipe then you can try making biryani using vermicelli. Today we present you with "Semiya Biryani" which is easy to make and is quite filling and satisfying.
Story first published: Thursday, July 16, 2015, 14:47 [IST]
Desktop Bottom Promotion