For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టొమాటో : పుదీనా చట్నీ

|

చట్నీ లేదా పచ్చడి పాపులర్ ఇండియన్ సైడ్ డిష్. పచ్చడి లేని భోజనం... చేవచచ్చిన జీవితం. అంటుంటారు. ఎందకంటే మనిషన్నాక ఉప్పకారం తినాలి అంటారు అందుకు. ఉప్పు, కారం, పులుపు బాగా పట్టించి తయారు చేసే ఈ పచ్చళ్ళు రుచితో పాటు రంగు, వాసనలు కూడా అద్భుతంగా ఉంటాయి.

పచ్చళ్ళు రోటి, రైస్, చాట్స్, స్నాక్స్ వంటివాటికి చక్కటి కాంబినేషన్. అంతే కాదు... బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... దేనిలోనైనా సరే పచ్చడే విన్నర్. తెలుగువారు కోరుకునే పచ్చళ్లల్లో ముఖ్యమైనది కొత్తిమీర, పుదీనా, టమోటో పచ్చడి. కొత్తిమీర టమోటో లేదా పుదీనా టమోటో కాంబినేషన్లో చట్నీ చేస్తే చాలా రుచికంగా ఉంటుంది.ఈ రెండింటితో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:

పుదీనా ఆకులు: 1/2cup
టొమాటోలు : 6(బాగా పండినవి/మీడియం సైజువి)
ఉల్లిపాయ తరుగు: 1/2cup
పుట్నాలపప్పు : 1/2cup
ఎండుమిర్చి : 6-8
ఇంగువ : 1/2tsp
నూనె : తగినంత
ఆవాలు : 1/2tsp
మినప్పప్పు : 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత

Tomato: Pudina Chutny

తయారు చేయు విధానం :

1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, కాగాక ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసి వేయించి, పక్కన ఉంచాలి
2. తర్వాత అదే పాన్ లో ఉల్లితరుగు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, ఎండుమిర్చి, టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. ఆ తర్వాత పుదీనా ఆకులు జత చేసి మూడు నిమిషాలు వాటితో పాటు ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.
4. పుదీనా మెత్తబడ్డాక అందులో పుట్నాలపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి క్రిందికి దించుకోవాలి.
5. ఈ మొత్తం మిశ్రమం చల్లారే వరకూ అలాగే ఉంచి, తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. (నీళ్ళు కలకపకుండా ఉంటే త్వరగా చెడిపోకుండా ఉంటుంది).

English summary

Tomato: Pudina Chutny

Chutney is one of the most popular Indian side dishes. It is like pickle. People team up chutney with roti, rice, pour it over chats or dip deep fried snacks in it. There are many chutney recipes that are prepared using various ingredients like garlic, coriander, spices, green chillies, kachri (wild variety of cucumber), mango etc.
Story first published: Wednesday, June 25, 2014, 12:21 [IST]
Desktop Bottom Promotion