For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉసిరికాయ పులిహొర

|

Usirikaya Pulihora
కావలసిన పదార్థాలు:

బియ్యం - 1/2 kg
ఉసిరికాయలు - 8 no
పచ్చిమిరప -4 no
ఎండు మిరప - 4 no
పోపుదినుసులు - 2 tsp
ఉప్పు - తగినంగ
పసుపు - 1/4 tsp
వేరుశెనగ పప్పు - 1/2 cup
కరివేపాకు - 2 రెబ్బలు

తయారు చేయు విధానం:

మొదటగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వార్చి పెట్టుకోవాలి. తర్వాత ఉసిరి కాయల్ని తురిమి కొద్దిగా నీరు వేడి చేసి అందులో తురుమిన ఉసిరి కాయ వేసి 5 నిమిషాల తర్వాత నీరు వడపోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పు స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత ఆవాలు, పోపుదినుసులు(మినుములు, చెనిగి బ్యాడలు), వేరుశనగ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగ నివ్వాలి. తర్వాత ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, తురిమి, ఉడికించి పెట్టుకొన్న ఉసిరికాయ ముద్దను వేసి బాగా డ్రై చేసి అందులో ఆరబెట్టుకొన్న అన్నం వేసి బాగా కలగలిపి దింపుకోవాలి. అంతే వేడి వేడి ఉసిర పులిహొర రెడీ!

Story first published:Monday, November 2, 2009, 18:00 [IST]
Desktop Bottom Promotion