For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాంగీ బాత్

By Staff
|

Vangi Bath
కావలసిన పదార్థాలు:

చిన్న వంకాయలు: అరకిలో
సన్న బియ్యం: అరకిలో
నూనె : తగినంత
ఎండుకొబ్బరి ముక్కలు: 100గ్రా
పచ్చిబఠాణి: 100గ్రా
జీడిపప్పు : 50గ్రా
నిమ్మకాయ : 1
ఎండుమిర్చి : పది
ఉప్పు : తగినంత
మినపప్పు : 2 టీ స్పూన్స్
పచ్చి శనగపప్పు : 2 టీ స్పూన్స్
ధనియాలు : 2 టీ స్పూన్స్
గరంమసాలా : టీ స్పూన్
ఇంగువ : పావుటీస్పూను
నెయ్యి : 25 గ్రా

తయారు చేయు విధానం: వంకాయల్ని ఉప్పు నీటిలో సన్నగా పొడవుగా తరిగి వేయాలి. బియ్యాన్ని కాస్త పదునుగా వండుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణాలి పెట్టి కొద్దిగా నూనేవేసి అందులో సెనగపప్పు, మినపప్పు వేసి కాస్త వేగాక ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు, కొబ్బరి ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించి పొడిచేసి ఉంచాలి. బాణాలిలో మరికాస్త నూనె వేసి వంకాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. తరువాత అదే బాణాలిలో ఇంకాస్త నూనే వేసి జీడిపప్పు దోరగా వేయించి తరువాత వంకాయ ముక్కలు, ఎండుమిర్చిపొడి, మసాలా, తగినంత ఉప్పు వేసి నెయ్యిపోసి అట్లకాడతో నెమ్మదిగా కలియదిప్పాలి. వెడల్పాటి బేసిన్ లోకి అన్నంతీసుకుని వంకాయ మసాల్నంతా వేసి, నిమ్మకాయ పిండి అన్నం మొత్తం కలపాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.

Story first published:Friday, September 25, 2009, 10:50 [IST]
Desktop Bottom Promotion