For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజ్ స్టార్టర్: చిల్లీ గోబి డ్రై ఫ్రై రిసిపి తెలుగులో

|

మధ్యహ్నా సమయంలో రెగ్యులర్ భోజనం కంటే మరింత స్పెషల్ మీల్స్ కోరుకుంటున్నట్లైతే చిల్లీ గోబి డ్రై ఫ్రై ఒక బెస్ట్ రిసిపి. ఈ చిల్లీగోబి డ్రై ఫ్రై రిసిపిని మధ్యహ్న భోజనంలో తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం . ఈ స్టార్టర్ రిసిపి పొట్టనింపుతుంది. టేస్ట్ బడ్స్ ను సంతృప్తి పరుస్తుంది.

ఇలాంటి స్టార్టర్ రిసిపి రెస్టారెంట్స్ లో అయితే కొద్దిగా గ్రేవీలాగ తయారుచేసి అందిస్తుంటారు . ఈ రుచికరమైన గోబి డ్రై ఫ్రై రిసిపిని గ్రేవీ లేకుండా తయారుచేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా నోరూరిస్తుంటుంది. చిల్లీ గోబీ ప్రైని స్ప్రింగ్ ఆనియన్, చిల్లీ సాస్ తో సర్వ్ చేస్తే అద్భుతమైన రుచికలిగి ఉంటుంది. మరి ఈ స్పెషల్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chilli Gobi Dry Fry Recipe

Serves: 3
Preparation Time: 16 minutes
Cooking Time: 10 minutes

Chilli Gobi Dry Fry Recipe

కావల్సిన పదార్థాలు:
గోబి(కాలీప్లవర్): 1(చిన్న పువ్వులుగా విడిపించి వేడి నీళ్ళలో వేసి కడిగి పెట్టుకోవాలి)
మైదా: 4tbsp
కార్న్ ఫ్లోర్: 1tbsp
బేకింగ్ సోడా: 1/4tsp
చిన్న ఉల్లిపాయలు(స్ప్రింగ్ ఆనియన్): 1కట్ట(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ధనియాల పొడి : 1 tsp
ఛాట్ మసాలా: 1 tsp
జీలకర్ర పొడి: 1tsp
రెడ్ చిల్లీ పేస్ట్: 1tsp
సోయా సాస్: ½ tsp
వెనిగర్: ½ tsp
వెల్లుల్లి: 1 (tsp)
అల్లం: 1 tsp(సన్నగా తరిగాలి)
ఆయిల్ : 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: 2 cups

Chilli Gobi Dry Fry Recipe

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మైక్రోవేవ్ బౌల్ తీసుకొని, అందులో మైదా, కార్న్ స్టార్చ్, బేకింగ్ పౌడర్, ధనియాలపొడి, రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్, వెనిగర్, సన్నగా తరిగిపెట్టుకొన్న అల్లం వెల్లుల్లి ముక్కలు మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
2. అదే బౌల్లో ఒక కప్పు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని చిక్కగా జారుడుగా కలుపుకోవాలి. అలాగే ఒక స్పూన్ నూనె కూడా అందులో వేయాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఎగ్ బీటర్ తో కలగలుపుకోవాలి.
3. పిండి మిశ్రమం రెడీ అయిన తర్వాత. ముందుగా కడిగి శుభ్రంగా ఉంచుకొన్న గోబి(కాలీఫ్లవర్ పువ్వులను)వేసి బాగా మిక్స్ చేయాలి. గోబీకి పేస్ట్ బాగా పట్టే వరకూ మిక్స్ చేసుకోవాలి.

Chilli Gobi Dry Fry Recipe
Chilli Gobi Dry Fry Recipe

4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో డీప్ ప్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె వేడయ్యాక అందులో పిండిలో మిక్స్ చేసుకొన్న గోబిని కొద్దిగా కొద్దిగా తీసుకొని నిధానంగా వేసి డీఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీఫ్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకూ డీప్ ఫ్రై చేసి వాటిని తీసి టిష్యు పేపర్ మీద వేయాలి. అదనపు ఆయిల్ పీల్చుకుంటుంది.
5. 15నిముషాల తర్వాత గోబిని తిరిగి డీప్ ఫ్రై చేయాలి. పాన్ లో నుండి తీసి టిష్యు పేపర్ మీద వేసి నూనె పీల్చుకొన్న తర్వాత సర్వ్ చేయాలి.
6. ఇలా గోబి మొత్తం రెడీ చేసుకొన్న తర్వాత, వాటి మీద కొద్దిగా ఛాట్ మసాలను చిలకరించాలి.
7. చాట్ మసాలా, గోబి బాగా మిక్స్ చేసి, తర్వాత స్ప్రిగ్ ఆనియన్, సన్నగా తరిగిన చిల్లీ మరియు చిల్లీ సాస్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి. దీన్ని సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.

Chilli Gobi Dry Fry Recipe

న్యూట్రీసియన్ చిట్కా: బరువు తగ్గాలనుకొనే వారికి ఇది కరెక్టైన ఫుడ్ కాదు. ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన స్నాక్ మరియు వీటిలో వంద కంటే ఎక్కువగా క్యాలరీలున్నాయి..

English summary

Veg Starter: Chilli Gobi Dry Fry Recipe

This afternoon we want you to try out something better and much more delicious. The chilli gobi dry recipe is one of the best ways to start your afternoon lunch. This starter recipe is filling and above all the crispy nature of this recipe is what will make you indulge.
Story first published: Saturday, February 14, 2015, 13:11 [IST]
Desktop Bottom Promotion