For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ హెల్తీ నవరతన్ కుర్మా

|

సాధారణంగా రోటీ, చపాతీ మరియు బట్టర్ కుల్చా వంటి వాటికి టేస్టీ గ్రేవీ లేకుండా సాటిస్ఫై అనిపించదు . రోటీ, చపాతీ, కుల్చాలకు ఎక్స్ ట్రా టేస్ట్ ను అందిస్తుంది . టేస్ట్ బడ్స్ కు వండర్ఫుల్ టేస్ట్ ను అందిస్తుంది.

కాబట్టి ఈ రోజు మీకోసం ఒక వెజిటేబుల్ నవరతన్ కుర్మాను పరిచయం చేస్తున్నాము . పేరులో ఉంది నవ అంటే 9 , అంటే 9 రకాల వెజిటేబుల్స్ తో ఈ కుర్మాను తయారుచేస్తారు . సాధారణంగా ఇలాంటి కుర్మాలన్నీ మనం రెస్టారెంట్స్ లో చూస్తుంటాము . కానీ ఇలాంటి ఫుడ్ ను ఈ రోజు మనం ఇంట్లోనే ఏవిధంగా తయారుచేసుకోవాలో తెలుపుతున్నాము . ఇది ఒక హెల్తీ అండ్ రిచ్ గ్రేవీ రిసిపి. ఎందుకంటే ఇందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు, వివిధ రకాల వెజిటేబుల్స్ జోడించడం వల్ల చాలా వెరైటీ డిష్ గా తయారవుతుంది. మరి ఇలాంటి వెరైటీ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం....

Vegetable Navrathna Korma Recipe


కావల్సిన పదార్థాలు:
క్యారెట్ - 1 cup (boiled )
పచ్చిబఠానీలు - 1 cup (boiled )
టమోటోలు - 2 cups
ఉల్లిపాయలు - 2 cups
కాలీఫ్లవర్ - 1 cup (boiled )
పైనాపిల్ - 1 cup
పొటాటోలు - 1 cup (boiled )
రెడ్ క్యాప్సికమ్ - 1 cup
జీడిపప్పు - 1 cup
ఎండు ద్రాక్ష - 1/2 cup
పసుపు- 1/4th teaspoon
జీలకర్ర - 1/2 teaspoon
ధనియాపౌడర్ - 1/2 teaspoon
కారం - 2 teaspoons
గరం మసాలా - 1/2 teaspoon
పైన్ ఆపిల్ జ్యూస్ - 1 cup
క్రీమ్ - 2 tablespoons
ఉప్పు రుచికి సరిపడా
నూనె తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, టమోటోలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి.

2. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసి అందులో కొన్ని జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు మరో పాన్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, గరం మసాలా, కారం, ధనియాలపొడి, మరియు పసుపు వేసి బాగా వేగించాలి.

4. మసాలాలు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ, టమోటో, క్యాప్సికమ్, పైన్ ఆపిల్, పచ్చిబఠానీలు, క్యారెట్, బీన్స్, పొటాటో, ఎండు ద్రాక్షను వేసి మొత్తం మిశ్రమాన్ని ఒక నిముషం వేగించుకోవాలి.

5. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి . ఇప్పడు అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను వేసి బాగా కలపాలి.

6. కూరలన్నీ ఉడికిన తర్వాత అందులో పైనపిల్ జ్యూస్ వేసి మిక్స్ చేయాలి. ఉప్పు రుచి చూసి వేయాలి .

7. మొత్తం ఉడికిన తర్వాత గ్రేవీ టాప్ గా క్రీమ్ ను వేయాలి . అంతే డెలిషియస్ నవరతన్ కుర్మా రిసిపి రెడీ.

English summary

Vegetable Navrathna Korma Recipe

Rotis, chapathis or butter kulchas can never be complete without a tasty gravy. Gravies add an extra taste to the rotis and they also give a wonderful taste to your taste buds too.
Story first published: Wednesday, March 2, 2016, 17:04 [IST]
Desktop Bottom Promotion