For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాటర్ చెస్ట్‌నట్స్ అండ్ పుట్టగొడుగుల ఫ్రై రిసిపి : వీడియో

మీరు ఎప్పుడైనా వాటర్ చెస్ట్‌నట్స్ మరియూ పుట్టగొడుగులు కలిపి కూర చెయ్యడానికి ప్రయత్నిచారా?? ఈ కూర తయారీ సులభం. దీనిని చపాతీలు, ఫ్రైడ్ రైస్‌లలోకి గ్రేవీలాగా కూడా సర్వ్ చేయవచ్చు.

By Lekhaka
|

మీరు ఎప్పుడైనా వాటర్ చెస్ట్‌నట్స్ మరియూ పుట్టగొడుగులు కలిపి కూర చెయ్యడానికి ప్రయత్నిచారా?? ఈ కూర తయారీ సులభం. దీనిని చపాతీలు, ఫ్రైడ్ రైస్‌లలోకి గ్రేవీలాగా కూడా సర్వ్ చేయవచ్చు.

ఈరోజు మేము ఇచ్చే ఈ కూరా తయారీ విధానాన్ని చూసి తప్పక ప్రయత్నించండి. తప్పక ప్రయత్నించండి అని ఎందుకు నొక్కి చెప్తున్నామంటే ఈ కూరా చాలా రుచికరంగా ఉంటుంది. రోజువారీ కూరలతో విసిగిపోయి ఏదైనా సులభంగా తయారయ్యే కొత్త వంటకం ప్రయత్నించాలనుకుంటే కనుక ఇది మంచి ఎంపిక.లేదా ఆదివారాలు ఏమైన కొత్త వంటకం తయారు చేద్దమనుకున్నా కూడా ఇది ప్రయత్నించవచ్చు.ఇది మీ ఆదివారాన్ని మరింత ఆహ్లాదకరంగా అమారుస్తుంది కూడా.మీరు కనుక వీగన్స్ అయితే రుచికరమైన ఈ కూర తప్పక ప్రయత్నించాల్సిందే.మాంసాహార ప్రియులకి కూడా ఫ్రైడ్ రైస్‌తో పాటు డ్రై చిల్లీ చికెన్‌కి బదులు ఈ కూర వడ్డిస్తే వారు కూడా మరింత కావాలని అడుగుతూ ప్లేట్లు ఖాళీ చెయ్యడం ఖాయం.

ఈ కూర తయారీ చాలా సులభం అని చెప్పాము కదా. దీనికి కావాల్సిన పదార్ధాలు కూడా మీ ఇంటి పక్కనున్న సూపర్ మార్కెట్లో దొరికేవే.ఇక ఆలశ్యమెందుకు దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం చూడండి.

Water Chestnut (Singhara) And Mushroom Fry Video

ఎంత మందికి సరిపోతుంది-4

ప్రిపరేషన్ టైం-15 నిమిషాలు

వండటానికి-20 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:

Water Chestnut (Singhara) And Mushroom Fry Video

1.వాటర్ చెస్ట్ నట్స్-1 కప్పు(చిన్న ముక్కలుగా కోసుకోవాలి)

2.బటన్ మష్రూంస్-1 కప్పు(చిన్న ముక్కలుగా కోసుకోవాలి)

3.పచ్చి కిర్చి-2-3(సన్నగా తరగాలి)

4.వెల్లుల్లి-10 రెబ్బలు(సన్నగా తరగాలి)

5.అల్లం-1 అంగుళం ముక్క(సన్నగా తరగాలి)

6.ఉల్లిపాయలు-1(ముక్కలుగా తరగాలి)

Water Chestnut (Singhara) And Mushroom Fry Video

7.ఆయిస్టర్ సాస్-1 టేబుల్ స్పూను

8.సోయా సాస్-1 టేబుల్ స్పూను

9.ఉప్పు-రుచికి తగినంత

10.పంచదార-చిటికెడు

11.నూనె-కూర వేయించడానికి సరిపడా

12.నల్ల మిరియాలు-1 టీ స్పూను(మెత్తగా దంచాలి)

13.వెనిగర్-1 టీ స్పూను

14.కార్న్ ఫ్లోర్-2 టేబుల్ స్పూన్లు

15.పార్స్లీ లేదా కొత్తిమీర-1 కట్ట(సన్నగా తరగాలి)

Water Chestnut (Singhara) And Mushroom Fry Video

తయారీ విధానం:

1.ఒక మూకుడు వేడీ చేసి అందులో నూనె వెయ్యాలి

2.నూనె వేడెక్కాకా పచ్చి మిర్చి,అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి.

3.ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి అవి లేత గులాబీ రంగులోకి వచ్చేవరకూ వేయించాలి.

4.దీనిలో పుట్ట గొడుగులు,ఉప్పు వెయ్యాలి.

5.కూరని బాగా కలిపితే పుట్తగొడుగులలోని తేమ కూర పీల్చుకుంటుంది.

Water Chestnut (Singhara) And Mushroom Fry Video

6.వాటర్ చెస్ట్‌నట్స్ వేసి మరలా కలపాలి.

7.ఇప్పుడు కూరలో సాసెస్ వెయ్యాలి. ముందుగా ఆయిస్టర్ సాస్ వేసి కొద్దిగా సోయా సాస్ కూడా వెయ్యాలి.ఇవి కలిపేటప్పుడే చిటికెడు పంచదార కలపడం అమ్ర్చిపోవద్దు సుమా. దీనివల్లే మీ కూర్కై ప్రత్యేక రుచి వస్తుంది.

8.ఇప్పుడు కూరలో కాసిని నీళ్ళు కూడా పొయ్యాలి.వేరొక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి నీళ్ళు పోసి పేస్టులాగ చెయ్యాలి.

9.ఇప్పుడు దీనిని కూరలో వేసి కూర అంతా కలిసేటట్లు కలపాలి.

10.కూరలో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లాలి.

Water Chestnut (Singhara) And Mushroom Fry Video

11.కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపెయ్యాలి.

12.కూరని మూకుడులోంచి వేరొక గిన్నెలోకి తీసుకుని పైన మరలా కొత్తిమీరతో గార్నిష్ చెయ్యాలి.

అంతే, వాటర్ చెస్ట్‌నట్ మరియూ పుట్టగొడుగుల కూర తయారు,దీనిని రోటీ లేదా రైస్6తో కలిపి సర్వ్ చేసి మీ కుటుంబ సభ్యులని ఆశ్చర్యపరచండి.

English summary

Water Chestnut (Singhara) And Mushroom Fry Video

Today's water chestnut and mushroom fry recipe is a must try, we insist. Yes, this is an easy recipe for those days that you want to try something new. Take a look.
Story first published: Monday, December 12, 2016, 17:54 [IST]
Desktop Bottom Promotion