For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీకెండ్ స్పెషల్ : చట్ పేట్ చెన్నా రిసిపి

|

సాధరణం పనిచేసే ఉద్యోగస్తులు, కాలేజీ, స్కూల్ పిల్లలున్న ఇంట్లో వీకెండ్ కోసం ఎదురుచూస్తుంటారు. కాస్తా విశ్రాంతి పొందాలంటే వారంతం వరకూ వేచి చూడాల్సింది . అంతే కాదు, వీకెండ్ లో బద్దకంగా ఉంటుంది. వంటగదిలో కూడా ఎక్కువ సమయం గడపడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. అటువంటప్పుడు చాలా సింపుల్ గా మరియు చాలా త్వరగా తయారయ్యే వంటను వెతుకుతుంటారు.

అటువంటివారికి ఒక సింపుల్ రిసిపి, రుచికరమైనది, కడుపు నింపేది ఈ చట్ పేట్ రిసిపి . ఈ రిసిపిని ఒక సారి మీరు టేస్ట్ చూశారంటే తప్పకుండా మీకు నచ్చుతుంది. అంతే కాదు, ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది . మరి పిల్లలకు మరియు పెద్దలకు ఇష్టమైన విధంగా ఎలా తయారుచేయాలో ఈ క్రింది పద్దతిలో ఫాలో అవ్వాల్సిందే...

Weekend Special: Chatpate Chane Recipe

కావల్సిన పదార్థాలు:
కాలే చానే / బ్లాక్ గ్రామ్: : 1cup
ఆయిల్: 1tbsp
జీలకర్ర ½tsp
ఇంగువ: ¼tsp
ఉల్లిపాయ : ½cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటా : ½cup
పచ్చిమిర్చి: 1 (మద్యలోకి కట్ చేసుకోవాలి)
కొత్తిమీర పొడి: 2tsp
పసుపు: ¼ tsp
కారం: ½ స్పూన్
ఆంమ్చూర్ /డ్రై మ్యాంగో పౌడర్: ½tps
చనా మసాలా: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తాజా కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగినది)
నిమ్మరసం: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా కాలే చెనా లేదా బ్లాక్ గ్రామ్ ను శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్ళు పోసి 5-6గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి.
2. 6గంటల తర్వాత ప్రెజర్ కుక్కర్ లో రెండు కప్పుల నీళ్ళు పోసి , ఒక స్పూన్ ఉప్పు వేసి, నానబెట్టుకొన్నా చెన్నా అందులో వేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేయాలి . వేడయ్యాక అందులో జీలకర్ర మరియు ఇంగువ కూడా వేసి వేగించాలి.
4. జీలకర్ర చిటపటలాడతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి.
6. తర్వాత అందులో ధనియాల పొడి, పసుపు, కారం, డ్రై మ్యాంగో పౌడర్ , చెనా మసాలా వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుకొన్న చెన్నాను నీరు వంపేసి, పోపుదినుసులు వేగుతున్న పాన్ లో వేసి , ఉప్పు సరిచూసుకొని తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు చిలకరించి, బాగా మిక్స్ చేయాలి.
8. చెన్నా బాగా డ్రైయ్ గా తయారయ్యే వరకూ ఉడికించుకోవాలి.
9. చివరగా అందులో కొత్తిమీర తరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేసి సర్వ్ చేయాలి అంతే చెన్నా చట్ పేట్ రిసిపి రెడీ.

English summary

Weekend Special: Chatpate Chane Recipe

Weekend is all about relaxing and hogging on good food. But laziness tends to take over and you do not feel like spending too much time in the kitchen. So, what do you do? You cook something simple and hassle free.
Story first published: Friday, December 6, 2013, 16:32 [IST]
Desktop Bottom Promotion