For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించే సలాడ్: పైనాపిల్ కుకుంబర్ సలాడ్

|

పైనాపిల్ ను ఒక ఆరోగ్యకరమైన పండుగా భావిస్తారు. ఎందుకంటే పైనాపిల్లో విటమిన్ సి మరియు మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

ఇది ఒక హెల్తీ ఫ్రూట్. ఇది కొద్దిగా పుల్లగా మరియు స్వీట్ గా ఉండటం వల్ల దీన్ని అనేక వంటకాల్లో జోడిస్తుంటారు. ముఖ్యంగా ట్రెడిషినల్ వంటలైన స్వీట్ డిష్ లలో ఎక్కువగా పైనాపిల్ ను ఉపయోగిస్తుంటారు.

పైనాపిల్ తో తయారుచేసే ఏ వంటైనా సరే సమ్మర్ సీజన్ లో ఎనర్జీని అందిస్తాయి. ఇది సమ్మర్ లో ఎనర్జిటిక్ ఫుడ్ గా తీసుకుంటారు . ఈ వెజిటేరియన్ సలాడ్ రిసిపిలో కొన్ని వెజిటేబుల్స్ (కీరదోసకాయ)మరియు కొన్ని మసాలాలు జోడించడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. కీరదోసకాయను జోడించడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది. మరి ఈ సమ్మర్ స్పెషల్ సలాడ్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం....

Weight Loss Recipe: Pineapple Cucumber Salad

కావల్సిన పదార్థాలు:
పైనాపిల్: 1(sliced)
కీరదోసకాయ: 2(తొక్క తొలగించి కావల్సిన సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి)
టమోటో: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర: కొద్దిగా(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
సలాడ్ డ్రెస్సింగ్ కోసం :
నిమ్మరసం: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
మిరియాల పొడి: 1tsp
తేనె: 3tbsp

తయారుచేయు విధానం:
1. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, మరియు తేనె వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
2. ఈ మొత్తం మిశ్రమం పల్చబడే వరకూ బాగా పేస్ట్ చేసుకోవాలి.
3. మరో బౌల్లో, కట్ చేసి పెట్టుకొన్న కీరదోస, పైనాపిల్, టమోటో మరియు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే సలాడ్ డ్రెస్సింగ్ కూడా వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
5. మొత్తం కలగలుపుకొన్నాక, ఈ సలాడ్ ను 10 నిముషాలు రిఫ్రిజరేటర్ లో నిల్వచేసి, తర్వాత తీసి చల్ల చల్లగా సర్వ్ చేయాలి. అంతే వెయిట్ లాస్ పైనాపిల్ కుకుంబర్ సలాడ్ రిసిపి రెడీ.

English summary

Weight Loss Recipe: Pineapple Cucumber Salad

Pineapples are considered as one of the world's healthiest fruits. It is rich in vitamin C and magnesium. This healthy fruit can be added to a lot of dishes to create a tangy and sweet taste. Traditionally, pineapples were used in sweet dishes, cakes and tarts. Today, using this nectarous fruit in a salad is the best way to enjoy it.
Story first published: Monday, May 18, 2015, 16:34 [IST]
Desktop Bottom Promotion