For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాసేజ్ ఫ్రైడ్ రైస్ రిసిపి : ఇండియన్ స్టైల్

|

కాక్ టైల్ సాసేజ్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతారు . అయితే మనం మన ఇండియన్ స్టైల్లో ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. యమ్నీ కాక్ టైల్ సాసేజ్ రెడీ చేయడానికి బాస్మతి రైస్ మరియు వివిధ రకాల వెజిటేబుల్స్ ను చేర్చుకోవచ్చు. మన ఇండియన్ టేస్ట్ కోసం మన ఇండియన్ మసాలా దినుసులను జోడించాలి.

కాక్ టైల్ సాసేజ్ కోసం తయారుచేసే మసాలాను సాసేజ్ కు బాగా పట్టే విధంగా చూసుకోవాలి. అంతే కాదు, ఈ డిష్ కు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. మరి కాక్ టైల్ సాసేజ్ ఎలా తయారుచేయాలో చూద్దాం....

Yummy Cocktail Sausage Fried Rice Recipe

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్ - 1 cup
కాక్ టైల్ సాసేజ్ - 200 gms ( fried and sliced)
పచ్చిబఠానీలు - ½ cup
టమోటో - 1 (chopped)
ఉల్లిపాయ - 1 (chopped)
ఆలివ్ ఆయిల్ - 2 tbsp
పెప్పర్ పౌడర్ - 2 tbsp
పసుపు - ½ tsp
మసాలాలు(దాల్చిన చెక్క, యాలకలు) - 2 nos
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు- 1 cup

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి, కాగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. ఇప్పుడు, టమోటో ముక్కలు వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
3. తర్వాత పెప్పర్ పౌడర్, పసుపు, యాలకలు మరియు దాల్చిన చెక్క కుక్కర్లో వేసి వాటి పూర్తి ఫ్రై చేసుకోవాలి.
4. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిబఠానీలు, సన్నగా కట్ చేసుకొన్న సాసేజ్ ను ప్రెజర్ కెక్కర్ లో వేసి ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
6. అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
7. పూర్తయిన తర్వత స్టౌ మీద నుండి క్రింద దించి పెట్టుకోవాలి.
8. సాసేజ్ ఫ్రైడ్ రైస్ ను సన్నగా తరిగిని కొత్తిమీరతో గార్ని ష్ చేసి, వేడిగా సర్వ్ చేయాలి.
9. ఇష్టమైతే వెల్లుల్లి చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Yummy Cocktail Sausage Fried Rice Recipe

Cocktail sausages is much loved among kids and they are best eaten with sandwiches. But, today lets try an Indian dish - cocktail sausage fried rice. To prepare this yummy treat use basmati rice and add tons of vegetables to the fried rice. Indian spices too should be included in abundance to give out that perfect aroma and taste.
Story first published: Monday, June 8, 2015, 14:21 [IST]
Desktop Bottom Promotion