For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ అండ్ టేస్టీ మసాలా ఇడ్లీ-ఇండియన్ బ్రేక్ ఫాస్ట్

|

ట్రెడిషినల్ సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ, వడ మరియు సాంబార్. ప్రతి సౌత్ ఇండియన్ ఇంట్లోని రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ వంటకాల్లో ఇది ఒకటి. ఈ బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడం సులభం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సాధారణంగా ఇడ్లీని బ్రేక్ ఫాస్ట్ గా తయారు చేసినప్పుడు తప్పని సరిగా రెండు మూడు మిగులుతుంటాయి. అయితే మిగిలిన వాటిని పడేయకుండా ఇలా మసాలా ఇడ్లీలా తయారు చేస్తే పిల్లలు ఇష్టంగా మద్యహ్నం కూడా తింటారు.

ఈ చిన్న ఇడ్లీలు చాలా రుచికరంగా మరియు హెల్తీగా ఉంటాయి. ఈ ఇడ్లీలకు కొన్ని న్యూట్రీషియన్ వెజిటేబుల్స్ ను మిక్స్ చేయడం వల్ల హెల్త్ బ్రేక్ ఫాస్ట్, మరియు కడుపు నింపుతుంది. మరి ఈ ఫేమస్ మసాలా ఇడ్లీని ఎలా తయారు చేయాలో ఇక సారి చూద్దాం...

మిగిలిన ఇడ్లీలు: 8
పచ్చి మిరపకాయలు: 2(మద్యకు కట్ చేసుకోవాలి)
అల్లం: చిన్న ముక్క(తురుము)
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కత్తిరించాలి)
టమోటా: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర: (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పసుపు: 1/4tsp
రెడ్ చిల్లి పౌడర్: 1/2tsp
కొత్తిమీర పొడి: 1tsp
సోపు గింజలు పొడి: 1/2tsp
గరం మసాలా పొడి : ఒక చిటికెడు (అవసరం అయితే)
నిమ్మరసం: 1/2tbsp(అవసరం అనుకుంటే)
ఆయిల్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆవాలు:1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి, తర్వాత అందులో ఆవాలు వేసి చిటపటలాడాక, అందులో కరివేపాకు కూడా వేసి రెండు నిముషాలు వేగించాలి.
2. తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీదు ఐదు నిముషాల పాటు వేగించుకోవాలి. తర్వాత వెంటనే పసుపు, కారం, ధనియాలపొడి, సోంపు గింజలు, గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేస్తూ వేగించాలి.
4. తర్వాత అందులోనే తరిగిన టమోటో ముక్కలు వేసి మరో 5నిముషాలు టమోటోలు మెత్తబడేవరకూ వేగించుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఇడ్లీలను ముక్కలుగా చేసుకోసి అందులో వేయాలి. మసాలా అంతా ఇడ్లీలలకు బాగా పట్టేలా నిధానంగా మిక్స్ చేస్తూ, ఫ్రై చేసుకోవాలి.
5. చివరగా అందులో నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. క్రిందికి దింపుకొనే ముందు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి.

English summary

Yummy Masala Idli For Breakfast | హెల్తీ అండ్ టేస్టీ మసాలా ఇడ్లీ-ఇండియన్ బ్రేక్ ఫాస్ట్

The traditional South Indian breakfast consists of the puffy white idli, vada and sambar. In every South Indian household, one of these dishes is a must. The idli which is made from rice flour is said to be healthy as it contains starch which is good for the human body. The fluffy idli is easy to prepare and most women of today prepare this dish in about 10 minutes.
Desktop Bottom Promotion