For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యమ్నీ పిండి చెన్న రిసిపి

|

పిండిచెన్నను పంజాబి పిండి చోలే అని పిలుస్తారు. ఇది మంచి హెల్తీ ఫుడ్. ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండే హెల్తీ డిష్. ఇందులో ప్రోటీన్స్ , విటమిన్స్, మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి . వీటిని తినడానికి చాలా టేస్ట్ గా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతారు

ఈ రిసిపికి ఈ పేరు ఎలా వచ్చిందంటే?పంజామ్ లోని రావల్ పిండి ప్లేస్ నుండి వీటిని తయారుచేయడం వల్ల . ఈ డిష్ మన ఇండియా మరియు పాకిస్తాన్ లో ఎక్కువగా తయారుచేసుకుంటారు .

Yummy Pindi Channa Recipe

ఈ వంటను తయారుచేయడం చాలా సులభం మరియు ఇందులో వేసే మసాల వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది. మరి ఈ టేస్టీ డిష్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చిక్ పీస్(కాబూటీ చెన్న): 1cup
డ్రైడ్ దానిమ్మ విత్తనాలు: 2tsp
షాజీర: 2tsp

Yummy Pindi Channa Recipe

కారం: 3tsp
టీబ్యాగ్: 1
బిర్యానీ ఆకు: 3
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4

Yummy Pindi Channa Recipe

ధనియాలపొడి: 2tsp
జీలకర్రపొడి : 1tsp
యాలకలు: 4
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 3cups

Yummy Pindi Channa Recipe

చెన్న మసాల: 1tsp
గరం మసాల: 1tsp
డ్రై మ్యాంగో పౌడర్(ఆమ్చూర్): 1tsp
నూనె: 2tsp
అల్లం వెల్లుల్లి: 1tsp
పచ్చిమిర్చి: 4

Yummy Pindi Channa Recipe

తయారుచేయు విధానం:
1. చిక్ పేస్ లేదా కాబూళీ చెన్నను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
2. తర్వాత ఉదయం వాటిలోని నీళ్ళు పారబోసిన వాటిని చిక్ పీస్ ప్రెజర్ కుక్కర్ లో అందులో యాలకలుు, దాల్చిన చెక్క, టీబ్యాగ్, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. ఉడికిన తర్వాత, ప్రెజర్ కుక్కర్ లోప్రెజర్ తగ్గిన తర్వాత మూత తీసి అందులోని టీ బ్యాగ్ ను తొలగించాలి . తర్వాత ఉడికించిన నీటిని వేరే వౌల్లోనికి వంపి పెట్టుకోవాలి.

Yummy Pindi Channa Recipe

4. ఇప్పుడు దానిమ్మగింజలు, షాజీరను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని, ఉడికించిన చెన్నాలో వేయాలి.
5. అందులోనే కారం, ధనియాలు, రోస్ట్ చేసిన జీలకర్ర, చెన్న మసాలా, గరం మసాలా మరియు డ్రై మ్యాంగో పౌడర్ వేసి మిక్స్ చేయాలి.
6. తర్వాత పాన్ లో నూనె వేసి వేడిఅయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి.
7. ఇప్పుడు మసాలలతో మిక్స్ చేసి పెట్టుకొన్న కాబూలీ చెన్నాను పోపువేగుతున్న పాన్ లో వేసి, ఒక 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. నీరు మొత్తం డ్రై అయ్యే వరకూ ఉంచుకోవాలి.

Yummy Pindi Channa Recipe

8. వేగుతున్నప్పుడే షాజీర, అనర్దాన మరియు యాలకులు మొత్తం కలగలిసేలా మిక్స్ చేసి మూత పెట్టి పది నిముషాల మొత్త ఫ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే పిండి చోల రెడీ . ఈ పిండి చోలే పూరిలకు మంచి కాంబినేషన్. లేదా, టీటైమ్ స్నాక్ గా ఈవెనింగ్ టైమ్ లో తినవచ్చు.

English summary

Yummy Pindi Channa Recipe

Pindi chana is also called punjabi pindi chole is a very nutritious and healthy dish. It is rich in proteins, vitamins and minerals. It is very delicious to eat and children also love eating it.
Story first published: Friday, April 17, 2015, 16:22 [IST]
Desktop Bottom Promotion