Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Vamaku pachadi: చలికాలంలో దగ్గు,జలుబు రాకుండా ఉండాలంటే ఈ పచ్చడి తినాల్సిందే
దాదాపు అన్ని భారతీయ వంటగదుల్లో ఉండే ఓ పదార్థం వాము(ajwain). వంటల్లో, అనేక రకాల పానీయాలు తయారీకి వాముని ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి అనేఖ మినరల్స్ ని కలిగి ఉంటుంది. అయితే వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వాము ఆకులతో(ajwain leaves) కూడా అంతే మేలు చేస్తాయి. వామాకుని సర్వరోగ నివారిణి అనవచ్చు..ఇందులో అనేక ఔషధ గుణాలున్నాయి.
మదర్ ఆఫ్ హెర్బ్స్ గా కూడా పిలువడబే వామాకు బీపీ ఉన్నోళ్లకు బీజీ తగ్గిస్తుంది..బీపీ లేనివాళ్లకు బీపీ రాకుండా చేస్తుంది. గుండెజబ్బులు రాకుండా చేస్తుంది. కిడ్నీలో రాళ్లు రాకుండా,అజీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. చలికాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, కఫం నుంచి వామాకు రక్షిస్తుంది. ఇలా చేప్పుకుంటూ పోతే బోలెడు ఉంటాయి. వామాకులతో కొంతమంది కూరలు, బజ్జీలు కూడా వేసుకుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వామాకుతో చాలా రుచికరమైన పచ్చడి కూడా చేసుకోవచ్చు. వామాకు పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వామాకు పచ్చడి తయారీకి కావాల్సినవి
-వామాకులు
-చింతపండు
-పసుపు
-జీలకర్ర
-నువ్వులు
-నూనె
-పల్లీలు
-పచ్చి శనగపప్పు
-మినపప్పు
-ధనియాలు
-ఎండు మిర్చి
-వెల్లుల్లి
-ఉప్పు
-కరివేపాకు
-ఇంగువ
వామాకు పచ్చడి తయారీ విధానం
- వామాకులను కడిగా నీళ్లు లేకుండా ఆరబెట్టుకోండి
- ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నువ్వులు వేసి వేయించుకోవాలి.
దోరగా వేగిన తర్వాత వాటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు బాండీలో నూనె పోసి పల్లీలు,మినపప్పు,
పచ్చిశనగపప్పు,ధనియాలు,ఎండుమిర్చి వేసి వేయించుకోండి
- వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని నువ్వులు వేసిన ప్లేట్లోకి
తీసుకోండి.
- అదే బాండీలో కడిగి ఉంచిన వామాకులు,పసుపు,చింతపండు వేసి కలిపి మూత
పెట్టి మీడియం మంట మీద ఆకులను మగ్గించుకోవాలి.
-మధ్యమధ్యలో కలుపుతూ అందులోని నీరు ఆవిరి అయ్యే వరకు ఉడికించుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ బాండీని పక్కన పెట్టండి.
-ఇప్పుడు వేయించిన నువ్వులు,పల్లీల మిశ్రమం,జీలకర్ర,వెల్లుల్లి
రెబ్బలు,రుచికి సరిపడా ఉప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత ఉడికించిన వామాకులను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.
-ఇప్పుడు ఈ పచ్చడి కోసం తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం పాన్
లో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఆవాలు,దంచిన వెల్లుల్లి, పచ్చి
శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
-తర్వాత ఎండు మిర్చి,కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. చివరగా ఇంగువ వేసి
కలిపి ఈ తాలింపును పచ్చడిలో వేసి కలుపుకుంటే నోరూరించే వామాకు పచ్చడి
రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications