వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా..

Posted By:

వినాయక చవితి లేదా గణేష్ చుతుర్థి అనగానే రకరకాల పిండి వంటకాలు గుర్తుకొస్తుంటాయి. బొజ్జ గణపయ్యకు రకరకాల వంటకాలను తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అయితే వినాయక చవితికి చేసే నైవేద్యాలలో బెల్లం కుడుములు ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

కుడుములు లేని వినాయక చవితిని ఊహించలేం. వినాయకుడికి ఇవంటే మహా ఇష్టం. వీటిని తయారుచేయడానికి పెద్గగా సమయం కూడా పట్టదు. చాలా ఈజీగా వీటిని తయారుచేసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి జరుపుకుంటారు. ఈ క్రమంలో వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Vinayaka Chavithi 2026 Special Bellam aaviri Kudumulu Recipe in Telugu

బెల్లం ఆవిరి కుడుముల తయారీ విధానం

-1 కప్పు బియ్యం పిండి
-1 కప్పు బెల్లం తరుము
-2 టీస్పూన్ల నెయ్యి
-చిటికెడు ఉప్పు
-యాలకల పొడి

వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..

బెల్లం ఆవిరి కుడుములు తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 2 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇందులోనే 1 కప్పు బెల్లం తురుము, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోండి.

-బెల్లం కరిగిన తర్వాత అందులో 2 టీస్పూన్ల నెయ్యి వేసుకోండి. సువాసన కోసం ఇందులో కొద్దిగా యాలకల పొడి కూడా వేసి కలుపుకోండి. తర్వాత ఇందులోనే 1 కప్పు బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా మీడియం మంట బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలా అయినప్పుడు స్టవ్ ఆపేయండి.

-తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి అందులో 1 గ్లాసు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు వేడి చెయ్యాలి. తర్వాత ఇడ్లీ పాత్ర అచ్చులకు నెయ్యి రాసి రెడీ చేసుకున్న మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకొని మీకు నచ్చిన షేపులో కుడుముల్లా వత్తుకొని ఇడ్లీ పాత్ర అచ్చుల్లో పెట్టుకోండి.

-తక్కువ మంట మీద 20 నిమిషాల పాటు కుడుములను ఇడ్లీ పాత్రలో ఉడకనివ్వాలి.

-తర్వాత మూతతీసి చూస్తే బెల్లం కుడుములు రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 8, 2026, 10:42 [IST]
Desktop Bottom Promotion