Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కేవలం 10 నిమిషాల్లో డబుల్ టేస్ట్ మ్యాగీ ఆమ్లెట్ చేయండిలా..
ఉదయం ఫటాఫట్ రెడీ అయ్యే బ్రేక్ ఫాస్ట్ ఏది అని ఆలోచించినప్పుడు, బ్రేక్ ఫాస్ట్ కోసం కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకున్నప్పుడు, సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేవి రెండే రెండు..ఒకటి మ్యాగీ, మరొకటి ఆమ్లెట్. ఈ రెండూ పిల్లల నుండి పెద్దల వరకు అందరి ఫేవరెట్. మరి ఈ రెండు అద్భుతమైన రుచులను కలిపి ఒకే వంటకంగా మార్చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన నుండి పుట్టిందే ఘుమఘుమలాడే మ్యాగీ ఆమ్లెట్.
సాధారణ ఆమ్లెట్ కు భిన్నంగా, మెత్తటి ఆమ్లెట్ మధ్యలో మసాలా మ్యాగీ నూడుల్స్ తగులుతుంటే ఆ రుచే వేరు. ఈ వంటకం చేయడం చాలా సులభం, కానీ తినేటప్పుడు కలిగే అనుభూతి మాత్రం అమోఘం. దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మీ పిల్లలు అల్పాహారం తినడానికి మారాం చేస్తుంటే, ఇలా కొత్తగా చేసిపెట్టండి, ఒక్క ముక్క కూడా వదలకుండా ఇష్టంగా తినేస్తారు. రుచికరమైన మ్యాగీ ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
మ్యాగీ నూడుల్స్ - 1 ప్యాకెట్
గుడ్లు - 2
ఉల్లిపాయ - 1 (చిన్నది)
పచ్చిమిర్చి - 1 లేదా 2
కొత్తిమీర తరుగు - కొద్దిగా
అల్లం తురుము - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టీస్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి, మ్యాగీని, దాని మసాలాను వేసి ఉడికించండి. నీళ్లు ఎక్కువగా లేకుండా మ్యాగీ కొద్దిగా పొడిగా అయ్యేలా చూసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గుడ్లు పగలగొట్టి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తురుము, చిటికెడు ఉప్పు వేసి నురగ వచ్చేలా బాగా గిలకొట్టండి.
-తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేయండి. నూనె వేడెక్కాక గిలకొట్టిన గుడ్డు మిశ్రమాన్ని పోసి, ఆమ్లెట్ లా సమానంగా పరచండి.
-ఆమ్లెట్ కొద్దిగా ఉడికిన తర్వాత దానిపై ఒకవైపు మనం వండిన మ్యాగీని నీట్ గా పరచండి.
-ఒక నిమిషం పాటు చిన్న మంటపై ఉడికించి, ఆమ్లెట్ ను రెండో వైపుకు జాగ్రత్తగా మడవండి. రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చుకుంటే, వేడివేడి మ్యాగీ ఆమ్లెట్ రెడీ,
-దీనిని టొమాటో కెచప్ తో కలిపి తింటే ఆ రుచి రెట్టింపు అవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications