కత్రినా కైఫ్ నాజూకైన అందం వెనుక ఉన్న స్పెషల్ డ్రింక్ ఇదే..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ ఫిట్‌ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై అబ్బురపరిచే స్టంట్స్ చేయాలన్నా, తన నాజూకైన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయాలన్నా ఆమెకే సాధ్యం. కత్రినా అద్భుతమైన ఆరోగ్యానికి, అసూయ పుట్టించే ఆమె ఫిట్‌ నెస్‌ కు ప్రధాన కారణం.. కఠినమైన వర్కవుట్స్, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లే.

Want a Figure Like Katrina Kaif Try Her Favorite Crazy Concoction Smoothie Recipe in Telugu

ఆమె తన డైట్‌ లో ఆరోగ్యకరమైన స్మూతీలకు పెద్దపీట వేస్తుంది. వాటిలో కత్రినాకు అత్యంత ఇష్టమైనది క్రేజీ కొంకాక్షన్. ఈ పేరేదో విచిత్రంగా ఉంది కదూ. స్వయంగా కత్రినానే ఒక ఇంటర్వ్యూలో ఈ స్మూతీ రెసిపీని అభిమానులతో పంచుకుంది. ఒక అద్భుతమైన పుస్తకం చదువుతున్నప్పుడు తాను ఈ రెసిపీని నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది.

క్రేజీ కొంకాక్షన్ తయారీకి కావలసిన పదార్థాలు

-1 అవకాడో
-1 అరటిపండు
-4-5 పాలకూర ఆకులు
-1 టీస్పూన్ చియా విత్తనాలు
-1 టీస్పూన్ కొబ్బరి నూనె
-1 టీస్పూన్ నిమ్మరసం
-1 టీస్పూన్ కోకో పౌడర్
-4-5 ఐస్ క్యూబ్స్

కరీనా కపూర్ ఫేవరెట్ సూప్ ఇదే..బెలెడు ప్రయోజనాలు..ఎలా చేసుకోవాలంటే..

క్రేజీ కొంకాక్షన్ తయారీ విధానం

-ముందుగా అవకాడో, అరటిపండు తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని పాలకూర ఆకులు, చియా గింజలతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత అందులో కొబ్బరి నూనె, నిమ్మరసం, కోకో పౌడర్, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి బాగా కలపాలి.

-అంతే కత్రినా కైఫ్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ స్మూతీ రెడీ.

ఈ స్మూతీ ఎందుకు అంత స్పెషల్?

అవకాడోలు: వీటిలో ఫైబర్, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియంతో పాటు గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావనను ఇస్తుంది.

చియా గింజలు: స్మూతీ పోషక విలువలను ఇవి రెట్టింపు చేస్తాయి. ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఇందులో మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలో వాపులను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

కొబ్బరి నూనె: స్మూతీలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

దీన్ని రోజూ తాగొచ్చా?

ఈ స్మూతీలో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ, అవకాడో, అరటిపండు, కొబ్బరి నూనె లాంటి పదార్థాల్లో కేలరీలు కూడా ఎక్కువే ఉంటాయి. కాబట్టి రోజుకు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు కాకుండా, మీ శరీర అవసరాలకు తగినట్లుగా మితంగా తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా లేదా ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతున్నా.. దీన్ని మీ డైట్‌ లో చేర్చుకునే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించడం బెటర్.

[ of 5 - Users]
Story first published: Monday, July 27, 2026, 17:21 [IST]
Desktop Bottom Promotion