Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పెళ్లిళ్ల స్పెషల్.. హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్.. బ్యాచ్లర్స్ సైతం సింపుల్‌గా చేసుకునేలా.!
చికెన్ అనగానే చాలా వెరైటీలు గుర్తొస్తాయి. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లలోనూ చాలా చికెన్ స్పెషల్స్ చూస్తుంటాం. వాటిలో ముఖ్యమైనది హైడ్రా పాత్ స్పెషల్ షాహి రెడ్ చికెన్. ఫంక్షన్ల స్పెషల్ డిష్‌ను ఇంట్లోనే సింపుల్‌గా బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా ఎలా చేయాలో చూద్దాం..

ప్రొటీన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ పుష్కలంగా ఉండే చికెన్‌ను ఇష్టపడని నాన్‌వెజ్ ప్రియులు ఉండరు. వండే విధానం సరిగా ఉంటే ఏ స్పెషల్ అయినా రుచి అదిరిపోతుంది. అందుకే చికెన్‌తో ఎన్నో వెరైటీలు ట్రై చేసి కుటుంబీకులతో పాటు అతిథుల మన్ననలు పొందుతుంటారు. ఈ క్రమంలో ఈ సారి మీ ఇంట్లో వాళ్లు చికెన్ స్పెషల్ అడిగినప్పుడు ఇలా హైదరాబాద్ స్టైల్లో హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్ ట్రై చేసి చూడండి. ఫిదా అయిపోవాల్సిందే..
హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్- అరకేజీ
కశ్మీరీ రెడ్ చిల్లీ- 10
జీడిపప్పు- 15
పెరుగు- అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
ఉల్లిపాయ- నాలుగు
టమాటా- ఒకటి
ధనియాల పొడి- అరటీస్పూన్
గరం మసాలా- అరటీస్పూన్
జీలకర్ర పొడి- అరటీస్పూన్
మసాలా దినుసులు- టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర- కొద్దిగా
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్ గ్రేవీ కోసం
ముందుగా ఉల్లిపాయను పొడవైన ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి.
హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్ తయారీ విధానం
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కశ్మీరీ రెడ్ చిల్లీ, జీడిపప్పు, డీప్ ఫ్రైడ్ ఆనియన్, టమాటా ముక్కలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
చికెన్‌లో ఈ మసాలా పేస్ట్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా నూనె వేసి గంటపాటు నాననివ్వాలి. ఇలా చేసినట్లయితే మసాలా ముక్కలకు బాగా పడుతుంది.
ఇప్పుడు పాన్ తీసుకుని స్టవ్‌పైన పెట్టి వేడయ్యాక నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో చికెన్ మిశ్రమం వేసి మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మధ్యలో కూర మొత్తం కలిసే గరిటెతో కలుపుకోవాలి. పచ్చివాసన పోయాక కొన్ని నీళ్లు పోసుకోవాలి. కాసేపటికి నూనె పైకి తేలుతుంది. అప్పటివరకూ చిన్న మంటమీద చికెన్‌ను ఉడికించుకోవాలి. చివరిగా కసూరి మేతి వేసుకోవచ్చు. నూనె పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
మసాలా ఘాటుతో రుచికరమైన హైడ్రా పాత్ షాహి చికెన్ రెడీ. వేడి వేడి అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు చికెన్‌ను రొటీన్‌గా కాకుండా ఇలా చేసి చూడండి. ఇంటిల్లిపాదీ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications