Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
అమ్మమ్మల కాలం నాటి కోడి పులావ్ రెసిపి..తింటుంటే నోటికి సర్గమే
కోడి పులావ్ అనేది భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన , ఇష్టపడే వంటకాల్లో ఒకటి. ఇది బిర్యానీని పోలి ఉన్నప్పటికీ దీని తయారీ విధానం కొంచెం సులభంగా ఉంటుంది, తక్కువ మసాలాలను ఉపయోగిస్తారు, దీనివల్ల వంటకం అసలైన చికెన్ రుచి, సువాసన మరింత ఆస్వాదించవచ్చు. సాధారణంగా ఇది వీకెండ్స్, ప్రత్యేక సందర్భాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. పాతకాలం నాటి స్టైల్ లో కోడిపులావ్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-దాల్చిన చెక్క
-ధనియాలు
-గసగసాలు
-వెల్లుల్లి రెబ్బలు
-మరాఠీ మొగ్గ
-షాజీరా
-జాజికాయ
-జాపత్రి
-ఉప్పు
-సోంపు
-నెయ్యి
-నూనె
-అల్లం ముక్కలు
-యాలకలు
-జీడిపప్పు
-అనాస పువ్వు
-పచ్చి కొబ్బరి
-పుట్నాల పప్పు
-బిర్యానీ దినుసులు
-బిర్యానీ ఆకు
-కరివేపాకు
-చికెన్
-పచ్చిమిర్చి
-సోనా మసూరి బియ్యం

తయారీ విధానం
-ముందుగా 750 గ్రాముల సోనామసూరి బియ్యాన్ని శుభ్రంగా కడగండి.
-తర్వాత 750 గ్రాముల చికెన్ ముక్కలను కడిగి పక్కన ఉంచుకోండి.
-తర్వాత గరం మసాలా కోసం.. మిక్సీ గిన్నెలో 1 ఇంచు దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 6 మరాఠీ మొగ్గలు, 24 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, చిన్న జాజికాయ ముక్క, చిన్న జాపత్రి, 1 అనాస పువ్వు, 10 యాలకలు, 2 చిన్న అల్లం ముక్కలు, 15 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల సోంపు వేసి సన్నని సెగ మీద ఎర్రగా మారేదాకా వేపుకోవాలి. వేడి చల్లారాకా మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో సన్నగా,పొడవాటి చీలికలుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు, గాట్లు పెట్టుకున్న 15 పచ్చిమిరపకాయలను వేసి,చిటికెడు ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారేదాకా వేయించుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
-అరకప్పు పచ్చి కొబ్బరి, 3 టేబుల్ స్పూన్ల తినే శెనగపప్పును మిక్సీలో వేసి నీళ్లు కులుపుకుంటే మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

-అడుగు మందంగా ఉండే గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, కరివేపాకు వేసి జీడిపప్పు ఎర్రగా మారేదాకా వేయించుకున్నాడు గ్రైండ్ చేసి ఉంచిన ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ను వేసి నూనె పైకి తేలేదాకా వేయించుకున్నాక తయారుచేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి.
-తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి మూతపెట్టి మసాలాలన్నీ చికెన్ కు పట్టేలాగా మగ్గించుకున్నాక ఇందులో 6 గ్లాసుల కన్నా కొంచెం తక్కువగా నీళ్లుపోసి తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలిపి నీరు మరగనివ్వాలి.
-నీరు బాగా మరుగుతున్న సమయంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు సోంపు పొడి , పచ్చికొబ్బరి శెనగపప్పు పేస్ట్ వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
-తర్వాత అందులో సోనామసూరి వేసి అడుగు నుంచి కలబెట్టుకోవాలి. సన్నని మంట మీద ఈ పులావ్ ని వండాలి. 2 నిమిషాలు పెద్ద మంట మీద, 8 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. పులావ్ లోని నీరు అంతా ఇంకిపోయాక పెనం మీదకు గిన్నెను పెనం మీదకు మార్చుకోండి. అంతే కోడి పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
