Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రొటీన్ చికెన్ బోర్ కొట్టిందా? అయితే బీహారీ చికెన్ కుర్మా ట్రై చేయండి..అన్నం, చపాతీ, దోసెల్లోకి కేక!
ప్రతి వీకెండ్ లో ఇంటికి చికెన్ తెచ్చుకోవడం, ఎప్పుడూ చేసేలాగే ఇగురు లేదా పులుసు చేయడం మామూలేనా? కానీ ఈ వారం ఎప్పుడూ తినే రెగ్యులర్ చికెన్ కాకుండా, కాస్త కొత్తగా, మరింత రుచిగా ఉండేలా ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే బీహారీ చికెన్ కుర్మా ట్రై చేయండి.
బీహారీ చికెన్ కుర్మా.. కేవలం బిర్యానీతోనే కాదు, వేడి వేడి అన్నం, బగారా రైస్, చపాతీ, పూరీ, చివరకు దోసెల్లోకి కూడా అద్భుతంగా సెట్ అవుతుంది. బీహారీ చికెన్ కుర్మాను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చికెన్ - అర కిలో
నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకు - 1
యాలకులు - 1
లవంగాలు - 2
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - తగినంత
గ్రేవీకి నూనె - 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ఎండుమిర్చి - 3
వెల్లుల్లి(పొట్టు తీయని పూర్తి గడ్డలు) - 2
ఉల్లిపాయలు - 3
వెల్లుల్లి రెబ్బలు - 15 (పొట్టు తీసినవి)
అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 3
ధనియాల పొడి-ఒకటిన్నర టేబుల్ స్పూన్
పసుపు- అర టేబుల్ స్పూన్
కాశ్మీరీ కారం-2 టేబుల్ స్పూన్లు
చికెన్ మసాలా-1 టీస్పూన్
గరం మసాలా-అర టీస్పూన్
కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేశాక అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకుల వేసి వేయించండి. సువాసన రాగానే పసుపు, కొద్దిగా ఉప్పు వేసి, శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను వేయండి.
-మీడియం మంటపై చికెన్ లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించి పక్కన గిన్నెలో పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో గ్రేవీ కోసం 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు వేసి వేయించండి. తర్వాత ఎండుమిర్చి, రెండు వెల్లుల్లి గడ్డలు (లేదా పాయలు) వేసి వేయించండి.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించండి.
-ఉల్లిపాయలు వేగాక, పొట్టు తీసిన 15 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి చీలికలు వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించండి. ఇప్పుడు మంట తగ్గించి.. గరం మసాలా తప్ప మిగిలిన పొడులన్నీ (ధనియాల పొడి, పసుపు, కారం, చికెన్ మసాలా) వేసి నూనెలో బాగా కలపండి.
-మసాలా మిశ్రమం నుండి నూనె వేరుపడుతున్నప్పుడు, ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలపండి. ఇప్పుడు అర కప్పు వేడి నీళ్లు పోసి, మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికి, గ్రేవీ చిక్కబడే వరకు చిన్న మంటపై ఉడికించండి.
-చివరగా మూత తీస గరం మసాలా పొడి, కొత్తిమీర చల్లుకోండి. అంతే నోరూరించే బిహారీ చికెన్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications