Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మెత్తగా,జ్యూసీగా..నంజుకోడానికే కాదు అన్నంలోకి అదిరిపోయే చికెన్ ఫ్రై
చికెన్ ఫ్రై పేరు వింటేనే నాన్ వెజ్ లవర్స్ కి నోట్లో నీళ్లూరతాయి. అయితే కొందరు చికెన్ ఫ్రై గట్టిగా ఉంటే ఇష్టపడతారు..మరికొందరు సాఫ్గ్ గా ఉంటే ఇష్టపడతారు. అయితే మీరు సాఫ్ట్ గా ఉండే చికెన్ ఫ్రై ఇష్టపడేవాళ్లా? అయితే ఇంట్లోనే మెత్తగా జ్యూసీగా ఉండేలా, అన్నంలో కలుపుకోడానికి కూడా వీలుగా ఉండేలా కొద్దిపాటి గ్రేవీతో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్-1 కేజీ
అల్లంవెల్లుల్లి పేస్ట్-2 టేబుల్ స్పూన్లు
పసుపు-అర టీస్పూన్
త్రీ మ్యాంగో కారం-2-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు-తగినంత
పెరుగు-పావు కప్పు
నిమ్మరసం- అరచెక్క
ఆయిల్-డీప్ ఫ్రై చేయడానికి
ఉల్లిపాయ-1
కరివేపాకు-గుప్పెడు
ధనియాల పొడి- 3 టేబుల్ స్పూన్లు
గరం మసాలా- 2 స్పూన్లు
కారం- 2 స్పూన్లు
ఎండుకొబ్బరి పొడి- 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు- 8

తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి.
-ఇప్పుడు కుక్కర్ లో చికెన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, త్రీ మ్యాంగో కారం(ఘాటు తక్కువ, మంచి కలర్ వస్తుంది) పసుపు,పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలిపి మూతపెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
-గంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆపేయాలి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తే అందులో నీళ్లు ఊరి ఉంటాయి. చికెన్ ముక్కలను, నీళ్లను సపరేట్ గా తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఫ్రై చేయడం కోసం..స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు,కరివేపాకు వేసి మీడియం మంట మీద ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేదాకా వేయించాలి.
-తర్వాత ఉడికించి నీరు తీసేసిన చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద కలుపుతూ వేయించుకోవాలి.
-10 నిమిషాలు మీడియం మంట మీద వేయించిన తర్వాత మంటను తగ్గించి పాన్ లో ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఎండు కొబ్బరి పొడి, 8 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి ఇవన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా బాగా 5 నిమిషాలు కలపాలి.
-తర్వాత అందులో చికెన్ ఉడికించి పెట్టుకున్న నీళ్లను వేసి తక్కువ మంట మీద మరో 5-10 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి.
-ముక్కలు వేగాక స్టవ్ ఆపేయండి. అంతే జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ. స్నాక్ లా తిన్నా లేదా బగారా రైస్, పులావ్, వైట్ రైస్ తో తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications