Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
2026 న్యూ ఇయర్ స్పెషల్.. స్వీట్ షాప్ రుచిని మరిపించేలా మిల్క్ కేక్ ఇంట్లోనే..
కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఆశలు, కొత్త ఆశయాలు,అంతులేని వేడుకలు. 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభతరుణంలో నోరు తీపి చేసుకోవడం మన సంప్రదాయం. స్వీట్ షాపుల్లో దొరికే రకరకాల మిఠాయిల కంటే, మన చేతులతో స్వచ్ఛంగా, ప్రేమగా ఇంట్లో తయారుచేసుకునే స్వీట్ల రుచే వేరు.
మిల్క్ కేక్ (కళాకండ్) అంటే ఇష్టపడని వారు ఉండరు. బయట ఎంతో ఖరీదు ఉండే మిల్క్ కేక్ ను, కేవలం పాలు, చక్కెరతో ఎంతో సులభంగా, అద్భుతమైన రుచితో మీ వంటింట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆశ్చర్యపరిచేలా, నోటిలో వెన్నలా కరిగిపోయే పర్ఫెక్ట్ మిల్క్ కేక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు
ఫుల్ క్రీమ్ పాలు: 3 లీటర్లు
చక్కెర: 1 కప్పు
నిమ్మరసం: 2 టీస్పూన్లు
నీళ్లు: 2 టీస్పూన్లు
ఏలకుల పొడి: పావు టీస్పూన్
సన్నగా తరిగిన పిస్తా:2 టీస్పూన్లు
బాదం పప్పులు: 2 టీస్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి అడుగు ఉన్న పెద్ద పాన్ లేదా కడాయిని తీసుకోండి. అందులో 3 లీటర్ల ఫుల్ క్రీమ్ పాలను పోసి మీడియం మంటపై వేడి చేయండి. పాలు అడుగంటకుండా ఉండటానికి గరిటెతో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
-పాలు సగానికి తగ్గే వరకు (సుమారు 1.5 లీటర్లు అయ్యే వరకు) ఓపికగా మరిగించాలి.
-ఇప్పుడు ఒక చిన్న కప్పులో 2 టీస్పూన్ల నీళ్లు, 2 టీస్పూన్ల నిమ్మరసం కలపండి. మరిగి సగమైన పాలల్లో ఈ నిమ్మరసం మిశ్రమాన్ని మెల్లగా పోయండి. ఇలా చేయడం వల్ల పాలలో చిన్న చిన్న పలుకులు ఏర్పడతాయి. మిల్క్ కేక్ తినేటప్పుడు తగిలే ఆ దానెదార్ టెక్చర్ దీని వల్లే వస్తుంది.
-నిమ్మరసం వేసిన తర్వాత మిశ్రమాన్ని మరో 2 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఒక కప్పు చక్కెరను అందులో వేసి బాగా కలపండి. మంటను మీడియంలోనే ఉంచి, మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి.
-పాల మిశ్రమం బాగా చిక్కబడి, పాన్ అంచుల నుండి వేరు కావడం ప్రారంభించినప్పుడు అందులో పావు టీస్పూన్ ఏలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక స్టీల్ ప్లేట్ లోకి ఈ వేడి మిశ్రమాన్ని మార్చండి. ఈ మిశ్రమాన్ని ప్లేట్ లో సమానంగా పరచండి. మిల్క్ కేక్ మధ్యలో బ్రౌన్ కలర్ రావడానికి, బాగా సెట్ అవ్వడానికి దీనిని కనీసం 4 నుండి 5 గంటల పాటు కదల్చకుండా చల్లారనివ్వాలి.
-మిశ్రమం పూర్తిగా చల్లారి గట్టిపడిన తర్వాత ఒక కత్తికి నెయ్యి రాసి అంచులను వేరు చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కత్తిరించండి.
-చివరగా సన్నగా తరిగిన పిస్తా, బాదం పప్పులతో అలంకరించండి. అంతే ఎంతో రుచికరమైన, జ్యూసీగా ఉండే మిల్క్ కేక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications