Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
కారం లేకుండానే ఘాటుఘాటు రుచితో వైట్ మటన్ పులావ్.. మసాలా నషాళానికి అంటాల్సిందే.!
నాన్‌వెజ్ వంటకాల్లో మటన్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు. పులుసు, కీమా, వేపుళ్లు, పాయా, బోటీ ఫ్రై, తలకాయ కూర, బిర్యానీ ఇలా ఒకటేమిటీ ఎన్నో రకాల రుచులున్నాయి. ఇక మటన్‌తో పొలావ్ కాంబినేషన్‌తో వచ్చే మజాయే వేరు. దాని మసాలా ఘాటు నషాళానికి అంటాల్సిందే.. అయితే ఈ సారి రెగ్యులర్ మటన్ పులావ్ కాకుండా వైట్ మటన్ పొలావ్ రుచి చూస్తారా.. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం..

వైట్ మటన్ పులావ్‌కి కావాల్సిన పదార్థాలు
ముందుగా దీనికోసం మసాలా పేస్ట్‌ని తయారు చేసుకోవాలి. అందుకోసం కావాల్సినవి..
ఆనియన్- పెద్దది
అల్లం, వెల్లుల్లి
పచ్చిమిర్చి- 5 లేదా 6
దాల్చిన చెక్క
లవంగాలు- 5 లేదా 6
ఏలకులు- 3 లేదా 4
సోంపు గింజలు- ఒక టీ స్పూన్
ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత వీటితోపాటు మిగితా వాటిని కలిపి మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకుని మసాలా సిద్ధం చేసుకోవాలి.
మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు
వంట నూనె- ఒకటిన్నర టీస్పూన్
మటన్- కేజీ- మటన్ ఫ్లేవర్ కోసం ఒక్కో
ముక్కను 70 గ్రాములు ఉండేలా కట్ చేసుకోవాలి.
మసాలా దినుసులు
ఆనియన్- మూడు మీడియం సైజ్
బిర్యానీ ఆకు- 2
సోంపు గింజలు- ఒక టీ స్పూన్
ఉప్పు- సరిపడా
ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్
నీళ్లు- 350 మి.లీ
పుదీనా ఆకులు- ఒక కప్పు
కొత్తిమీర ఆకులు- ఒక కప్పు
బిర్యానీ రైస్ తయారీ కోసం
బాస్మతి రైస్- 3 కప్పులు
నీళ్లు- 6 కప్పులు
కసూరీ మెంతి- కొద్దిగా
నిమ్మ రసం- పావు టీ స్పూన్
తయారీ విధానం
-ముందుగా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు వేసుకోవాలి. దోరగా వేగిన తర్వాత మటన్ ముక్కలు వేసి కలుపుకోవాలి.
-ఉడికిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి వేగనివ్వాలి. అనంతరం నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు స్టవ్‌పై ఉంచాలి.
-తర్వాత కుక్కర్ మూత తీసి కర్రీ మొత్తాన్ని వేరే వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని ఆరు కప్పుల వేడి నీళ్లు పోసి స్టవ్‌పైన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు, కసూరీ మెంతి, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూతపెట్టి ఉడకనివ్వాలి. మొత్తం దగ్గరపడుతుండగా చిన్న మంట మీద ఉంచి పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వైట్ మటన్ పులావ్ రెడీ..
-కారం లేకుండా కేవలం మసాలా ఘాటుతో ఉల్లి ఫ్లేవర్‌తో
ఘుమఘుమలాడే వైట్ మటన్ పులాన్ను
గ్రేవీతో తింటే ఆ రుచే వేరు. ఈ సండే మీ ఇంట్లో ఈ స్పెషల్
డిష్ తయారుచేయండి. ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోవాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
