Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రెస్టారెంట్ వాళ్లు దాచే 5 సీక్రెట్స్ ఇవే.. ఇలా వండితే మీ చికెన్ కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్!
వీకెండ్ వస్తే చాలు చాలామంది ఇళ్లల్లో చికెన్ ఘుమఘుమలు రావాల్సిందే. కొందరికైతే రోజూ ఇంట్లో చికెన్ వంటకాలు ఉండాల్సిందే. అయితే ఇంట్లో చికెన్ కర్రీ ఎంత బాగా చేసినా, రెస్టారెంట్లో తినే ఆ పర్ఫెక్ట్ రుచి, చిక్కటి గ్రేవీ ఎందుకు రాదు అని మీరెప్పుడైనా ఆలోచించారా?
5 రెస్టారెంట్ సీక్రెట్స్, కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటిస్తే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీని ఈజీగా తయారుచేసుకోవచ్చని ప్రముఖ చెఫ్ ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియోలో తెలిపారు.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ - 1 కిలో (ఎముకలతో ఉన్నది)
పెరుగు - 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్ స్పూన్
కారం - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 4 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకులు - 2
నల్ల యాలకులు (పెద్దవి) - 4
అనాస పువ్వు - 2
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
మిరియాలు - 1 టీస్పూన్
జాపత్రి - 2
లవంగాలు - 4
పచ్చ యాలకులు - 4
ఉల్లిపాయలు - 4 (సన్నగా తరిగినవి)
ఉప్పు - తగినంత
కశ్మీరీ ఎర్ర కారం పొడి - 2 టేబుల్ స్పూన్లు (మంచి రంగు కోసం)
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
టొమాటో ప్యూరీ - 1 కప్పు
జీడిపప్పు పేస్ట్ - పావు కప్పు
వెన్న (బటర్) - 2 టేబుల్ స్పూన్లు
ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
కసూరి మేతి - 2 టీస్పూన్లు
రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలకు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి పట్టించి కనీసం 2 గంటల పాటు పక్కన పెట్టాలి. చికెన్ ఎంత ఎక్కువ సేపు నానితే అంత మృదువుగా, జ్యూసీగా మారుతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేశాక అందులో 2 బిర్యానీ ఆకులు, 4 నల్ల యాలకలు, 2 స్టార్ అనాస, దాల్చిన చెక్క, 2, 4 లవంగాలు, జాపత్రి, 4 పచ్చ యాలకలు వేసి వేయించండి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అర టీస్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇలా కొద్దిగా నీరు పోసి ఉల్లిపాయలను వేయించడం వల్ల గ్రేవీకి చక్కటి చిక్కదనం వస్తుంది.
-ఇప్పుడు అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, మిరియాల పొడి వేసి, మరో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి నూనె పైకి తేలేవరకు వేయించండి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, జీడిపప్పు పేస్ట్ వేసి కలపండి. నూనె పైకి తేలేదాకా సన్నని మంట మీద ఉడికించండి.
-ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి పెద్ద మంట మీద 4-5 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇలా పెద్ద మంట మీద చేయడం వల్ల చికెన్ ముక్కల్లోని జ్యూసెస్ బయటకు పోకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక కప్పు వేడి నీరు పోసి, మూతపెట్టి 12-15 నిమిషాల పాటు చికెన్ ఉడికేవరకు సన్నని మంటపై ఉంచాలి.
-చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు అందులో వెన్న, ఫ్రెష్ క్రీమ్, చేత్తో నలిపిన కసూరి మేతి వేసి కలపాలి. ఈ మూడూ కర్రీకి అసలైన రెస్టారెంట్ రుచిని, సువాసనను ఇస్తాయి.
-అంతే నోరూరించే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. వేడి వేడి నాన్, రోటీ లేదా బగారా రైస్ తో తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications