Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ఆపిల్ పండుని పాలల్లో ఉడికించి చేసే ఈ హల్వా రుచి అమోఘం..రెసిపీ ఇదే
చలికాలంలో చాలా మంది గాజర్ హల్వా, మూంగ్ దాల్ హల్వా లేదా రవ్వ కేసరిని ఇష్టపడతారు. ఇవన్నీ రుచిగా ఉంటాయన్నది నిజమే కానీ మీ శరీరానికి తక్షణ శక్తిని, వెచ్చదనాన్ని, బలాన్ని ఇవ్వాలంటే మాత్రం మీరు తప్పక ప్రయత్నించాల్సిన వంటకం ఆపిల్ బాదం హల్వా.
ఆపిల్ పండులోని పోషకాలు, బాదంలోని శక్తి కలగలిపిన ఈ హల్వా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఒక బూస్టర్ లా పనిచేస్తుంది. ఆపిల్ బాదం హల్వాని మీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఆపిల్స్: 1-2
బాదం పప్పు: అర కప్పు
పాలు: తగినన్ని
బొంబాయి రవ్వ: అర కప్పు
శనగపిండి: అర కప్పు
వెన్న లేదా నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
పాలపొడి: 1 కప్పు
చక్కెర: రుచికి సరిపడా
యాలకుల పొడి: చిటికెడు
తయారీ విధానం
-మొదట ఒక ఫ్రెష్ ఆపిల్ ను తీసుకుని శుభ్రంగా కడగాలి.
-స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక పాలను పోసి మరిగించండి. పాలు మరుగుతుండగా ఆపిల్ కాండాన్ని తీసివేసి, ఆపిల్ మొత్తాన్ని ఆ పాలల్లో వేయండి. ఆపిల్ మెత్తబడేలా దానిపై మరిగే పాలను పోస్తూ సుమారు 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఆపిల్‌ను బయటకు తీసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత ఆపిల్ తొక్క, విత్తనాలను తీసివేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ జార్లో ఆపిల్ ముక్కలు, పొట్టు తీసిన బాదం పప్పులు, ఒక గ్లాసు పాలు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో వెన్న లేదా నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక అందులో అర కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు శనగపిండి వేయాలి. మంటను సిమ్ లో పెట్టి పిండి మిశ్రమం మంచి సువాసన వచ్చే వరకు, బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో అర కప్పు పాలు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. ఆ మిశ్రమం పాలను పీల్చుకున్నాక, అర కప్పు పాలను కూడా పోసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆపిల్-బాదం పేస్ట్ ను పాన్‌లో వేయాలి. అడుగంటకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి.
-మిశ్రమం కాస్త దగ్గర పడి, పాన్ కు అంటుకోవడం మానేసినప్పుడు ఒక కప్పు పాల పొడిని, మీ రుచికి సరిపడా చక్కెరను వేసి బాగా కలపాలి. పాలపొడి హల్వాకు కోవా లాంటి కమ్మని రుచిని ఇస్తుంది.
-చక్కెర కరిగి హల్వాలో పూర్తిగా కలిసే వరకు సన్నని మంటపై ఉడికించాలి. చివరగా మంచి సువాసన కోసం యాలకుల పొడిని చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వేడి వేడి హల్వాను బౌల్ లోకి తీసుకుని, పైన సన్నగా తరిగిన బాదం ముక్కలతో గార్నిష్ చేసుకోండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆపిల్ బాదం హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
