Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
కరకర, కారం కారంగా.. నోరూరించే ముల్లంగి పూరీ ఎలా చేసుకోవాలంటే
చలికాలం వచ్చిందంటే చాలు వేడివేడిగా ఏదైనా తినాలని మనసు లాగుతుంది. రోజూ తినే ఇడ్లీ, దోస, పరాఠాలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి కాస్త కొత్తగా, కారంగా, కరకరలాడుతూ ఉండే ఒక అద్భుతమైన వంటకం ముల్లంగి పూరీ ట్రై చేయండి. ముల్లంగి అంటే కేవలం సలాడ్లు, పచ్చళ్లకే పరిమితం అనుకుంటే పొరపాటే. దానితో చేసే ఈ పూరీలు తిన్నారంటే దాని రుచికి దాసోహం అనాల్సిందే.
కేవలం 10 నిమిషాల్లో సిద్ధమయ్యే ముల్లంగి పూరీలు ఉదయం అల్పాహారంగానైనా, సాయంత్రం వేళ వేడి వేడి టీతో పాటు స్నాక్స్ గానైనా అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. కరకరలాడే ముల్లంగి పూరీలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ముల్లంగి (తురిమినది) - 1 కప్పు
బియ్యం పిండి - ఒకటిన్నర కప్పులు
జీలకర్ర - 1 టీస్పూన్
కలోంజి (నల్ల జీలకర్ర) - అర టీస్పూన్
పచ్చిమిర్చి - 2
అల్లం తురుము - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
నీరు - అవసరమైతే కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా ఒక లోతైన గిన్నెలో నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి పొయ్యి
మీద పెట్టండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు తురిమిన ముల్లంగిని
అందులో వేయండి. గిన్నెపై మూత పెట్టి సుమారు 5 నిమిషాల పాటు మీడియం
మంటపై ఉడికించండి. ఇలా చేయడం వల్ల ముల్లంగిలో ఉండే పచ్చి వాసన పోయి,
మెత్తగా తయారవుతుంది.
-ఐదు నిమిషాల తర్వాత ఉడికిన ముల్లంగిలో జీలకర్ర, కలోంజి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఈ మసాలాలన్నీ ముల్లంగితో కలిసి పూరీలకు అద్భుతమైన సువాసనను, రుచిని అందిస్తాయి.
-ఇప్పుడు మంటను తగ్గించి ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా బియ్యప్పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా కలపాలి. పిండి అంతా కలిసిపోయి ఒక ముద్దలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, కొద్దిగా చల్లారనివ్వాలి.
-గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో మెత్తగా పిసకాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లుకోండి, పిండి గట్టిగా ఉండాలి.
-ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లా ఒత్తుకోవాలి.
-తర్వాత ఒక కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఒత్తుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసి, బంగారు రంగులోకి వచ్చి కరకరలాడే వరకు రెండు వైపులా వేయించుకోవాలి.
-వేయించిన పూరీలను ఒక టిష్యూ పేపర్‌పై వేస్తే అదనపు నూనె పీల్చుకుంటుంది. అంతే వేడివేడిగా, కరకరలాడే ముల్లంగి పూరీలు రెడీ.
-ఈ పూరీలను మీకు నచ్చిన టమాటో సాస్, కొత్తిమీర చట్నీ లేదా చల్లటి పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
