Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చలికాలానికి బెస్ట్ మధురై వెల్లుల్లి కారం చట్నీ..ఇడ్లీ, దోసెల్లోకి కేక
వాతావరణం ఏమో చల్లగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఏదైనా వేడివేడిగా, కాస్త ఘాటుగా తినాలనిపిస్తుంటది. మరీ ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ఇంట్లో ఇడ్లీనో, దోసెనో వేసుకున్నప్పుడు ఎప్పుడూ తినే కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ కాకుండా కాస్త స్పైసీగా ఉండే పచ్చడి తినాలనుందా?
అయితే మధురై స్పెషల్ వెల్లుల్లి కారం చట్నీ ట్రై చేయండి. ఇది కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని పెంచడమే కాకుండా ఈ చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ చట్నీని ఒకసారి చేసి పెట్టుకుంటే దాదాపు 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే ఇంకా ఎక్కువ రోజులే వాడుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు: 30
సాంబార్ ఉల్లిపాయలు: 5
ఎండు మిరపకాయలు: 6
కాశ్మీరీ ఎండు మిరపకాయలు: 8
చింతపండు: పెద్ద ఉసిరికాయ సైజు
టమోటా: 1 పెద్దది
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు కోసం:
నువ్వుల నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు: 1 టీస్పూన్
మినపప్పు: 1 టీస్పూన్
కరివేపాకు: 1 రెమ్మ
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ గిన్నెలో పొట్టు తీసి పెట్టుకున్న 30 వెల్లుల్లి రెబ్బలు, 5 చిన్న ఉల్లిపాయలు, 6 సాధారణ ఎండు మిర్చి, 8 కశ్మీరీ ఎండు మిర్చి, ఉసిరికాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-మొదట వెల్లుల్లి మిశ్రమం నలిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్ద టమోటా ముక్కలను అందులో వేయండి. ఇప్పుడు మరోసారి మిక్సీని తిప్పి, చట్నీని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె పోయండి. నూనె కాస్త ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
-నూనె వేడెక్కాక ఆవాలు,మినపప్పు వేసి చిటపటలాడనీయండి. చివరగా తాజా కరివేపాకు వేసి వేయించండి.
-తాలింపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ ను పాన్ లో వేయండి. మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీటిని కూడా పాన్‌లో పోయండి. మంటను సిమ్ లో పెట్టి బాగా కలపండి.
-ఈ మిశ్రమాన్ని 2-5 నిమిషాల పాటు ఉడికించాలి. పచ్చి వాసన పోయి, మనం వేసిన నూనె చట్నీ నుండి వేరుపడి పైకి తేలేంత వరకు ఉడికించాలి.
-ఎప్పుడైతే నూనె పైకి తేలుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఘమఘమలాడే, స్పైసీ మధురై వెల్లుల్లి కారం చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా, లేదా ఇడ్లీ,దోసెల్లోకి నంచుకున్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







