Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చలికాలంలో వెచ్చదనాన్ని పంచే ఘుమఘుమలాడే టొమాటో సూప్..రెస్టారెంట్ రుచి ఇప్పుడు మీ ఇంట్లోనే
చలికాలం వచ్చేసింది. చల్లని గాలులు, మంచు దుప్పటి కప్పిన ఉదయాలు మనల్ని పలకరిస్తున్నాయి. ఈ సమయంలో ఒక గిన్నెడు వేడి వేడి టొమాటో సూప్ తాగితే ప్రాణం లేచొచ్చినట్లు ఉంటుంది. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక వరం. టమోటాలలోని విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. టొమాటో సూప్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
టమోటాలు: 5-6
ఉల్లిపాయ: 1 (మధ్యస్థ పరిమాణంలో, సన్నగా తరిగినది)
వెల్లుల్లి రెబ్బలు: 3-4 (సన్నగా తరిగినవి)
అల్లం: 1 అంగుళం ముక్క (సన్నగా తరిగినది)
నూనె లేదా వెన్న: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: అర టీస్పూన్
బిర్యానీ ఆకు : 1
దాల్చిన చెక్క: 1 చిన్న ముక్క
లవంగాలు: 2-3
పసుపు పొడి: పావు టీస్పూన్
కారం పొడి: అర టీస్పూన్
మిరియాల పొడి: పావు టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 2 కప్పులు
ఫ్రెష్ క్రీమ్ : 2 టేబుల్ స్పూన్లు
అలంకరణ కోసం: తురిమిన చీజ్ లేదా కొత్తిమీర
తయారీ విధానం
ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిని సన్నగా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి.
ఒక మందపాటి పాన్ లేదా కుక్కర్ లో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి సువాసన వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు వర్ణంలోకి మారే వరకు ఓపికగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం పొడి వేసి బాగా కలిపి, వెంటనే తరిగిన టమోటా ముక్కలను జోడించాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అంతా కలిసేలా కలపాలి.
పాన్‌పై మూతపెట్టి మంటను తగ్గించి, టమోటాలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా అయ్యే వరకు సుమారు 5-7 నిమిషాల పాటు ఉడికించాలి.
ఉడికిన ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుండి దించి పూర్తిగా
చల్లారనివ్వాలి. చల్లారిన తర్వా, అందులోని బిర్యానీ ఆకు, దాల్చిన
చెక్కను తీసివేసి, మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి నున్నటి ప్యూరీలా
గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ప్యూరీని వడకట్టుకుని అదే పాన్ లో వేసుకోవాలి. ఇలా చేయడం
వల్ల సూప్ గింజలు, తొక్కలు లేకుండా ఎంతో మృదువుగా ఉంటుంది.
ఈ ప్యూరీకి 2 కప్పుల నీళ్లు పోసి, ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు సూప్ ను ఒక పొంగు వచ్చేవరకు మరిగించాలి. చివరగా తాజా మిరియాల పొడి వేసి కలపాలి.
స్టవ్ ఆఫ్ చేసి సూప్ ఫ్రెష్ క్రీమ్ వేసి నెమ్మదిగా కలపాలి. అంతే నోరూరించే, ఘుమఘుమలాడే వేడి వేడి టొమాటో సూప్ రెడీ. పైన కొద్దిగా తురిమిన చీజ్ లేదా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి,వేయించిన బ్రెడ్ ముక్కలతో కలిపి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







