Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్
15 నిమిషాల్లో ఎగ్ పిజ్జా..రుచి అదిరిపోద్ది!..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే
చలికాలం వచ్చిందంటే చాలు.. సాయంత్రం కాగానే ఏదో ఒక వేడి వేడి పదార్థం తినాలనిపిస్తుంది. బయట చలి గజగజా వణికిస్తుంటే ఇంట్లో కూర్చుని రుచికరమైన ఆహారం తింటుంటే ఆ మజానే వేరు. సాధారణంగా మనం బజ్జీలు, పకోడీలు లేదా సూప్స్ వైపు మొగ్గు చూపుతాం. కానీ ఈసారి కాస్త వెరైటీగా, అటు రుచిని ఇటు ఆరోగ్యాన్ని అందించే ఎగ్ పిజ్జాని ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?
బయట దొరికే పిజ్జాల కంటే, ఇంట్లోనే గుడ్లు మరియు కూరగాయలతో చేసుకునే ఈ పిజ్జా ఎంతో శ్రేయస్కరం. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తినే ఈ ఎగ్ పిజ్జాను కేవలం 15 నుండి 20 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. మైదాతో నిండిన సాధారణ పిజ్జాలతో పోలిస్తే ఇందులో గుడ్లు, తాజా కూరగాయలు ఉండటం వల్ల పోషకాలు మెండుగా లభిస్తాయి.

కావలసిన పదార్థాలు
గుడ్లు: 4
పిజ్జా బేస్: 1
ఉల్లిపాయ: 1
క్యాప్సికమ్: అర కప్పు
చెర్రీ టమోటాలు: 3-4
పుట్టగొడుగులు: కొన్ని (ఐచ్ఛికం)
చీజ్: అర కప్పు
నూనె లేదా వెన్న: 1 టేబుల్ స్పూన్
సుగంధ ద్రవ్యాలు: మిరియాల పొడి, ఒరేగానో లేదా వాము, చిల్లీ
ఫ్లేక్స్
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమోటాలు, పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక తరిగిన కూరగాయలను వేసి మధ్యస్థ మంటపై కొద్దిసేపు వేయించండి. కూరగాయలు మరీ మెత్తగా ఉడకకూడదు, కాస్త కరకరలాడుతూ ఉంటేనే పిజ్జా రుచిగా ఉంటుంది.
-ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి, అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టండి . గుడ్డు సొన, తెల్లసొన బాగా కలిసేలా చూసుకోండి.
-ఇప్పుడు పిజ్జా బేస్ తీసుకోండి. దానిపై సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని సమానంగా పరచండి. పిజ్జా బేస్ అంచుల్లోకి మరీ ఎక్కువగా పోయకుండా జాగ్రత్తపడండి.
-గుడ్డు మిశ్రమంపై ముందుగా వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలను అందంగా పరచండి. ఆ తర్వాత తురిమిన చీజ్‌ను పిజ్జా మొత్తం కవర్ అయ్యేలా చల్లుకోండి. చివరగా కొంచెం ఒరేగానో లేదా వాము పొడిని చల్లండి.
-ఓవెన్ ను ముందుగా ప్రీ హీట్ చేసి పిజ్జాను లోపల ఉంచండి. 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేయండి. చీజ్ కరిగి, పిజ్జా అంచులు గోల్డెన్ కలర్ లోకి వచ్చి క్రిస్పీగా మారే వరకు ఉంచాలి.
-ఓవెన్ నుంచి బయటకు తీసిన వేడి వేడి పిజ్జాపై మరిన్ని చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో చల్లుకోండి. అంతే ఎగ్ పిజ్జా రెడీ. పిజ్జా కట్టర్ తో ముక్కలుగా కట్ చేసి, టమాటో సాస్‌తో సర్వ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
