Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్రెడ్ లేకుండానే బ్రెడ్ పకోడీ..టీ టైమ్‌లో దీని మజాయే వేరు..జస్ట్ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే..
వేడి వేడి టీ, దానికి తోడుగా కారంగా, నోటికి రుచిగా ఉండే బ్రెడ్ పకోడీ ఉంటే ఆ మజాయే వేరు. కానీ ఒక్కోసారి పకోడీ తినాలనిపించినప్పుడు తీరా వంటగదిలోకి వెళ్లి చూస్తే ఇంట్లో బ్రెడ్ ఉండదు.
ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్.. బ్రెడ్ లేకపోయినా, అచ్చం బ్రెడ్ పకోడీ రుచితో, అదే కరకరలాడే గుణంతో కేవలం 10 నిమిషాల్లో చేసుకోగలిగే బ్రెడ్ లెస్ బ్రెడ్ పకోడీ రెసిపీని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. పైన కరకరలాడుతూ, లోపల దూదిలా మెత్తగా ఉండే ఈ స్నాక్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

బ్రెడ్ లెస్ బ్రెడ్ పకోడీ తయరీకి కావలసిన పదార్థాలు
శనగపిండి: 2 కప్పులు
పెరుగు: అర కప్పు
ఉల్లిపాయ: పావు కప్పు
పచ్చిమిర్చి: 1 టీస్పూన్
తరిగిన అల్లం: 2 టీస్పూన్లు
కొత్తిమీర: కొద్దిగా
జీలకర్ర: 1 టీస్పూన్
కారం:1 టీస్పూన్
పసుపు :అర టీస్పూన్
చాట్ మసాలా: 1 టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి:1 టీస్పూన్
ఉప్పు: తగినంత
కసూరి మేతి: 2 టీస్పూన్లు
బేకింగ్ సోడా లేదా ఈనో: ఒకటిన్నర టీస్పూన్లు
పనీర్ ముక్కలు లేదా స్లైసులు: కొన్ని
నెయ్యి: కొద్దిగా
నూనె లేదా వెన్న: తగినంత
బ్రెడ్ లెస్ బ్రెడ్ పకోడీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి వేయండి. ఇప్పుడు అందులో జీలకర్ర, కారం, పసుపు, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు వేసి పొడిగా కలుపుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, చేతితో నలిపిన కసూరి మేతి వేసి బాగా కలపండి.
-ఇప్పుడు కలిపిన పిండి మిశ్రమంలో పెరుగు వేయండి. పెరుగు కలపడం వల్ల పకోడా లోపల గట్టిగా లేకుండా బ్రెడ్ లాగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, ఉండలు లేకుండా బజ్జీల పిండిలా కలుపుకోండి. పిండి మరీ పలచగా ఉంటే సరిగ్గా రాదు, కాబట్టి కాస్త చిక్కగా ఉండేలా చూసుకుని 2-3 నిమిషాల పాటు బాగా గిలకొట్టండి.
-తర్వాత పిండిలో బేకింగ్ సోడా లేదా ఈనో వేయండి. దానిపై ఒక స్పూన్ నీళ్లు పోసి ఒకే దిశలో మెల్లగా కలపండి. క్షణాల్లో పిండి ఉబ్బి, తేలికగా మారుతుంది. బ్రెడ్ వాడకుండానే బ్రెడ్ పకోడా లాంటి ఆకృతిని ఇచ్చేది ఈ స్టెప్ మాత్రమే.
-డీప్ ఫ్రై ఇష్టం లేనివారు.. ఒక శాండ్ విచ్ మేకర్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి లేదా వెన్న రాసి తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులో ఒక మందపాటి లేయర్ లా వేయండి. దాని మధ్యలో జాగ్రత్తగా ఒక పనీర్ ముక్కను ఉంచి, పైన మళ్లీ పిండితో కవర్ చేయండి. శాండ్‌విచ్ మేకర్ ను మూసి, రెండు వైపులా బంగారు రంగులోకి మారి, కరకరలాడేంత వరకు కాల్చండి.
-అంతే నోరూరించే వేడి వేడి బ్రెడ్ లెస్ బ్రెడ్ పకోడీ రెడీ. వీటిని సగానికి కట్ చేసి, పైన కొద్దిగా చాట్ మసాలా చల్లి, కారంగా ఉండే గ్రీన్ చట్నీ లేదా స్వీట్ చట్నీతో నంచుకుని తింటుంటే.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications