Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే!
వంట చేయడానికి మనం అత్యధికంగా ఉపయోగించే పాత్ర కడాయి లేదా బాండీ. నూనెలో వేయించడానికి, కూరలు వండటానికి దీన్నే ఎక్కువగా వాడతాము. అయితే రోజూ పొయ్యి మీద పెట్టి వాడటం వల్ల కడాయి అడుగు భాగంలో నల్లటి మసి, జిడ్డు పేరుకుపోయి ఒక మొండి పొరలా మారుతుంది. దీన్ని శుభ్రం చేయడం అంటే ఒక పెద్ద యుద్ధం చేసినట్లే అనిపిస్తుంది.

ఎంత సేపు స్టీల్ స్క్రబ్బర్లతో గంటల తరబడి రుద్దినా ఆ నల్లటి మసి వదలదు మన చేతులు నొప్పి పుడతాయి. ఈ కష్టాన్ని భరించలేక చాలాసార్లు దాన్ని అలాగే వదిలేస్తాము. రోజులు గడిచేకొద్దీ ఆ నల్లటి పొర మరింత మందంగా, గట్టిగా మారిపోతుంది. కానీ మీ ఇంట్లో ఉండే నల్లబడిన కడాయిలను సైతం అద్దంలా మెరిపించే ఒక అద్భుతమైన, పాతకాలం నాటి దేశీ చిట్కా ఏంటో ఇక్కడ చూడండి.
అమ్మమ్మల కాలం నాటి అసలైన రహస్యం
పాత రోజుల్లో ఇప్పుడున్నట్లు మార్కెట్లో రకరకాల ఖరీదైన, కఠినమైన రసాయన క్లీనర్లు ఉండేవి కావు. అయినా సరే, వారి వంటగదిలోని పాత్రలు ఎప్పుడూ కొత్తవాటిలా తళతళా మెరిసిపోయేవి. అందుకు కారణం వారి దగ్గర ఉన్న సహజసిద్ధమైన చిట్కాలే. ఈ మ్యాజిక్ చేయడానికి వంటగదిలో దొరికే మూడు వస్తువులు ఉంటే చాలు. అవే నిమ్మకాయ, బేకింగ్ సోడా, కొద్దిగా వంట ఉప్పు. ఈ మూడు కలిస్తే ఒక శక్తివంతమైన క్లీనింగ్ మిశ్రమం తయారవుతుంది. ఇది ఎంతటి మొండి మసినైనా ఇట్టే కరిగించేస్తుంది.
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి!
ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలంటే
ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోండి. అందులో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి, దానికి కొద్దిగా ఉప్పును కలపండి. ఇప్పుడు సగం కోసిన నిమ్మకాయను తీసుకుని, ఆ రసాన్ని ఈ మిశ్రమంలో పిండండి. నిమ్మరసం బేకింగ్ సోడాలో పడగానే బుస్ మంటూ నురుగు రావడం మీరు గమనిస్తారు. ఇక్కడ జరిగే సహజమైన రసాయన చర్యే మీ కడాయిపై ఉన్న మసిని వదిలించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ నురుగుతో కూడిన పేస్ట్ ను మీ కడాయి అడుగుభాగాన నల్లగా ఉన్న ప్రాంతం అంతటా మందంగా పూయండి. ఇలా పూసిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయండి. మీ కడాయి మరీ ఎక్కువ నల్లగా ఉండి, మసి పొర బాగా మందంగా ఉంటే, 15 నుండి 20 నిమిషాల వరకు కూడా ఉంచవచ్చు. ఆ సమయంలో ఈ మిశ్రమం మసి పొరలోకి చొచ్చుకుపోయి దాన్ని మృదువుగా చేస్తుంది.
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
రుద్ది, మెరుపును మీరే చూడండి
సమయం ముగిసిన తర్వాత, మీరు రసం పిండేసిన ఆ నిమ్మ తొక్కను తీసుకోండి. ఆ
తొక్కతోనే కడాయిని మెల్లగా రుద్దడం ప్రారంభించండి. గంటల తరబడి
స్క్రబ్బర్ తో రుద్దినా వదలని ఆ మొండి మురికి ఇప్పుడు ఈ నిమ్మతొక్కతో
సున్నితంగా రుద్దుతుంటేనే పొరలు పొరలుగా ఊడిరావడం చూసి మీరే
ఆశ్చర్యపోతారు. మసి మొత్తం వదిలిపోయిన తర్వాత, రోజూ వాడే డిష్ వాష్
సోప్ తో కడాయిని ఒకసారి కడిగేయండి. అంతే మీ కడాయి ఇప్పుడు మీరు
కొత్తదానిలా తళతళా మెరుస్తూ కనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications