Latest Updates
-
షుగర్ పేషెంట్లు తినాల్సిన బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవే.. -
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక -
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే.. -
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ -
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ.. -
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
రైస్ vs చపాతీ..రాత్రి డిన్నర్ లోకి ఏది తినాలి?..డాక్టర్ దీప్తి చెప్పిన కీలక విషయం.. -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
కొరియన్ల లాగా మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఈ 5 పండ్లు తినాల్సిందే! -
బరువు తగ్గించి, రక్తాన్ని పెంచే పనస గింజల లడ్డూ.. ఈ స్వీట్ తింటే ఎముకలు దృఢంగా, కంటిచూపు మెరుగ్గా!
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు!
కొద్ది సంవత్సరాల క్రితం స్నాక్స్ అనగానే గారెలు, బోండాలు, బజ్జీలు, సమోసాలు, కరకరలాడే జంతికలు వంటివి ఎక్కువగా తింటుండేవాళ్లు. అయితే మెళ్లిగా ఎక్కడికక్కడ పిజ్జా, బర్గర్ల కేఫ్ లు వచ్చేయడంతో సమోసా, బజ్జీలు వంటివి మానేసి పిజ్జాలు, బర్గర్లు, పాస్తా వంటి విదేశీ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. అయితే వీటిని తినడం వల్ల ఆ క్షణంలో రుచిగా అనిపిస్తదేమో కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా హాని జరుగుతుంది.
అందుకే ఈ విదేశీ పాస్ట్ ఫుడ్స్ పక్కన పెట్టి ఒక్కసారి బీహారీ దాల్ పిఠీ ట్రై చేయండి. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది. ఇది తయారుచేయడానికి మన వంటగదిలో ఎప్పుడూ ఉండే సాధారణ పదార్థాలు చాలు. బీహారీ దాల్ పిఠీ మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-కందిపప్పు
-గోధుమ పిండి
-పసుపు
-ఉప్పు
-ఇంగువ
-జీలకర్ర
-ఎండు మిరపకాయలు
-సన్నగా తరిగిన వెల్లుల్లి
-అల్లం
-పచ్చి మిరపకాయలు,
-నెయ్యి
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక
తయారీ విధానం
-ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి, పసుపు, ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి.
-పప్పు ఉడుకుతున్న సమయంలో, గోధుమ పిండిలో కాస్త ఉప్పు వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, పువ్వులు లేదా శంఖాల ఆకారంలో లేదా మీకు నచ్చిన డిజైన్ లో అందంగా మలుచుకోవాలి.
-పప్పు సగం ఉడికిన తర్వాత, ఈ గోధుమ పిండి పువ్వులను ఆ మరుగుతున్న పప్పులో జాగ్రత్తగా వేయాలి. కుక్కర్ మూతపెట్టి, పప్పు, పిండి పువ్వులు చక్కగా ఉడికి, కలిసిపోయేలా 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి.
-తాలింపు కోసం..ఒక బాండీలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి. ఈ ఘుమఘుమలాడే తాలింపును ఉడికిన దాల్ పిఠీపై పోయాలి.
-చివరగా కొత్తిమీర చల్లి, వేడివేడిగా పచ్చడి లేదా చట్నీతో వడ్డిస్తే ఆ రుచే వేరు.
పోషకాల గని - అమృతతుల్యమైన రుచి
దాల్ పిఠీ కేవలం రుచికరమైనదే కాదు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే పోషకాల గని. ఫాస్ట్ ఫుడ్స్ లాగా ఇందులో మైదా గానీ, నిల్వ ఉంచే రసాయనాలు గానీ అస్సలు ఉండవు. వేలకు వేలు పోసి తినే ఖరీదైన జంక్ ఫుడ్స్ కూడా దీని ముందు దిగదుడుపే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
