Latest Updates
-
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం!
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
స్ట్రీట్ ఫుడ్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది వేడివేడి చాట్. సాయంత్రం కాగానే కారం కారంగా, పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. కానీ అందులో వాడే నూనె, ఇతర ఆరోగ్య సమస్యల భయంతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అయితే ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా, కుక్కర్ లో ఎంతో సులభంగా చేసుకోగలిగే అద్భుతమైన రగడా చాట్ ఓ సారి ట్రై చేయండి. ఇది రుచిలో ఏమాత్రం తీసిపోదు సరికదా, ఆరోగ్యానికి కూడా వంద శాతం మేలు చేస్తుంది.

జీరో ఆయిల్ రగడా చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
నానబెట్టిన తెల్ల శనగలు - ముప్పావు కప్పు
బంగాళదుంపలు - 2
టమాటా - 1
పసుపు - 1 టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
చింతపండు రసం - 4 టేబుల్ స్పూన్లు
గరం మసాలా- 1 టీస్పూన్
జీలకర్ర పొడి- 1 టీస్పూన్
ధనియాల పొడి-1 టీస్పూన్
చాట్ మసాలా - 1 టీస్పూన్
కారం- 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
గార్నిష్ కోసం: ఆకుపచ్చ చట్నీ, తీపి చట్నీ, ఉల్లిపాయలు, టమాట ముక్కలు,
పచ్చిమిర్చి, అల్లం తురుము, సన్న కారప్పూస (సేవ్)
జీరో ఆయిల్ రగడా చాట్ తయారీ విధానం
-ముందుగా ముప్పావు కప్పు తెల్ల శనగలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి.
-తర్వాత రాత్రంతా నానిన శనగలను ఒక ప్రెషర్ కుక్కర్ లో వేయాలి. అందులోనే చెక్కు తీసిన రెండు బంగాళదుంపలు, ఒక టమాటాను కోయకుండా వేయాలి. ఇప్పుడు అందులో ఒక టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి, రెండు కప్పుల నీళ్లు పోయాలి. కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి.. ఉడికిన టమాటా పై తొక్కను మెల్లగా తీసేసి, ఆ టమాటాను శనగల్లోనే మెత్తగా మ్యాష్ చేయాలి. అలాగే ఉడికించిన బంగాళదుంపలను తీసి, సన్నగా తురుముకుని మళ్లీ కుక్కర్ లో వేసి బాగా కలుపుకోవాలి. రగడా చిక్కదనం సరిచేసుకోవడానికి అవసరమైతే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు.
-ఆ మిశ్రమంలోనే 4-5 టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేయాలి. ఆ తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, దంచిన ఎండుమిర్చి లేదా కారం అన్నీ వేసి బాగా కలపాలి. సన్నని మంటపై మరో రెండు మూడు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించి, చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి రగడా రెడీ.
-చాట్ తినే మజా అంతా దాన్ని సర్వ్ చేసే విధానంలోనే ఉంటుంది. ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా తయారుచేసుకున్న గుమగుమలాడే రగడాను వేయాలి. దానిపై కొద్దిగా గ్రీన్ చట్నీ, తీపి చట్నీ వేసుకోవాలి. ఆపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నని అల్లం తురుము చల్లాలి.
-దీనికి అదనపు రుచినిచ్చేందుకు పైన కొద్దిగా జీలకర్ర పొడి, ఎండుమిర్చి పొడిని చల్లాలి. చివరగా తాజా కొత్తిమీర, కరకరలాడే సేవ్ (సన్న కారప్పూస) తో అలంకరిస్తే నోరూరించే స్ట్రీట్ స్టైల్ రగడా చాట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications