ఫైబర్, ప్రోటీన్ ఫుల్.. బార్లీ దోశ తింటే బాడీ సెట్!

Posted By:

వేడి వేడి కరకరలాడే దోశను, చట్నీలో అద్దుకుని తింటుంటే ఆ మజాయే వేరు. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మంది తమకు ఇష్టమైన దోశను తినాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు బియ్యంతో చేసిన దోశలు తినాలంటే ఆలోచిస్తారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బియ్యం, రవ్వలకు దూరంగా ఉంటున్నారు.

Zero Rice 100 Percent Taste Try This Crispy Barley Dosa for Diabetes Control Recipe in Telugu

ఇలాంటి సమయంలో బార్లీ దోశ ట్రై చేయాల్సిందే. ఇందులో ఒక్క గింజ కూడా బియ్యం గానీ, రవ్వ గానీ వాడాల్సిన అవసరం లేదు. బార్లీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరగకుండా అదుపులో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. అలాగే దీని తయారీలో వాడే పెసర పప్పు వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. ఇది కండరాల బలానికి, వెయిట్ లాస్ కి ఎంతో సహాయపడుతుంది.

బార్లీ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు

బార్లీ గింజలు - అర కప్పు
పెసర పప్పు (పొట్టులేనిది) - అర కప్పు
మెంతులు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినంత

బార్లీ దోశ తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బార్లీ గింజలు, పెసర పప్పు, మెంతులు వేయాలి. వీటిని శుభ్రమైన నీటితో 3 నుంచి 4 సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా లేదా కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.

-నానిన గింజల్లోని నీటిని వంపేసి, మిక్సీ జార్‌ లో వేయాలి. కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి. పిండి మరింత బాగా పులియడానికి, మీ చేతితో కానీ లేదా విస్కర్ సహాయంతో కానీ కనీసం 5 నిమిషాల పాటు బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. ఇలా చేయడం వల్ల గాలి చేరి ఫెర్మెంటేషన్ చాలా బాగా జరుగుతుంది. ఆ తర్వాత మూతపెట్టి 6 నుండి 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.

-పిండి పులిసిన తర్వాత, అందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. దోశలు వేసుకోవడానికి వీలుగా పిండి మరీ గట్టిగా కాకుండా తగినన్ని నీళ్లు కలుపుకుని సరైన కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక పలుచగా దోశలు వేసుకోవాలి. కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుంటే.. కరకరలాడే బార్లీ దోశ రెడీ. మీకు ఇష్టమైన పల్లి చట్నీ లేదా అల్లం పచ్చడితో వేడివేడిగా లాగించేయండి.

[ of 5 - Users]
Story first published: Sunday, July 26, 2026, 11:17 [IST]
Desktop Bottom Promotion