Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పది నిమిషాల్లోనే స్వర్గం..జంటల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే అద్భుతమైన చిట్కా
ఏం పని చేస్తున్నారనేదానితో సంబంధం లేకుండా అందరి జీవితాలు బిజీగా మారిపోయాయి. ఈ బిజీ లైఫ్ లో కట్టుకున్న భర్యతోనో లేదా భర్తతోనో,తల్లిదండ్రులు, పిల్లలు లేదా ప్రియమైనవారితో గడపడానికి కూడా చాలామందికి సమయం దొరకట్లేదు. చేతిలో ఫోన్, ముందు టీవీ లేదా ల్యాప్ ట్యాప్..ఇలాంటి స్క్రీన్ ల మధ్య ఒకరికి ఒకరికి దూరం మరింత పెరుగుతోంది. అయితే మీ బంధంలో ఆత్మీయతను, సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి గంటల తరబడి సమయం కేటాయించాల్సిన అవసరం లేదని మీకు తెలుసా?
జంటల మధ్య పది నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో సాన్నిహిత్యాన్ని మెరుగుపర్చుకోడానికి 10 అద్భుతమైన, స్క్రీన్ ఫ్రీ కార్యకలాపాలు ఉన్నాయని రిలేషన్ షిప్ థెరపిస్ట్ ఎమ్ కస్తూరి తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ లో తెలిపారు. ఆ చిట్నాలను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీ లైఫ్ జిల్ జిల్ జిగా జిగాగా మారిపోతుంది.

కళ్లలో కళ్లు పెట్టి చూడటం
ఒకరికొకరు ఎదురుగా కూర్చోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, ఒకరి కళ్లలోకి ఒకరు తదేకంగా చూడండి. మాటలు మాట్లాడుకోవద్దు. మీ మనసులో ఎలాంటి భావాలు కలుగుతున్నాయో గమనించండి. ఇది మాటలకందని బంధాన్ని సృష్టిస్తుంది.
3-2-1 కృతజ్ఞత
ఇద్దరూ వంతులవారీగా, మీ భాగస్వామి గురించి మీరు మెచ్చుకునే 3 విషయాలు, మీ ఇద్దరి సంబంధం గురించి నచ్చే 2 విషయాలు, మీ గురించి మీరు ఇష్టపడే 1 విషయం పంచుకోండి. ఇది ఒకరిపై ఒకరికి గౌరవాన్ని పెంచుతుంది.
మినీ డ్యాన్స్ పార్టీ
మీకు ఇష్టమైన పాటను ప్లే చేయండి. స్టెప్పుల గురించి ఆలోచించకుండా, సిగ్గుపడకుండా కలిసి డ్యాన్స్ చేయండి. చిన్నపిల్లల్లా మారిపోయి, ఆ క్షణాన్ని ఆస్వాదించండి.
నిశ్శబ్ద సాన్నిహిత్యం
పక్కపక్కనే కూర్చొని, మాటలు లేకుండా ఒకరి భుజంపై ఒకరు వాలండి. ఒకరి ఉనికిని మరొకరు అనుభూతి చెందండి. ఈ నిశ్శబ్దం మీ మధ్య ఎన్నో భావాలను పంచుతుంది.
చేతి మసాజ్
ఒక్కొక్కరు 5 నిమిషాల పాటు, మరొకరి చేతికి సున్నితంగా మసాజ్ చేయండి. స్పర్శ ద్వారా ప్రేమను వ్యక్తపరచడం చాలా శక్తివంతమైనది. ఇది ప్రశాంతతను, సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.
10 నిమిషాల నడక
కలిసి బయటకు వెళ్ళండి. చేతిలో చేయి వేసి, పది నిమిషాలు నడవండి. సంభాషణను సహజంగా సాగనివ్వండి. ప్రకృతిలో గడపడం మీ మనసుకు సాంత్వననిస్తుంది.
శ్వాసను అనుసంధానించడం
వీపుకు వీపు ఆనించి లేదా ముఖాముఖిగా కూర్చొని, ఒకరి శ్వాసను మరొకరు అనుసరిస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంచుతుంది.
చిన్ననాటి కథలు పంచుకోవడం
మీ భాగస్వామికి ఇంతవరకూ తెలియని మీ చిన్ననాటి కథను ఒకటి చెప్పండి. ఇది ఒకరినొకరు కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
సుదీర్ఘ కౌగిలి
మాటలు లేకుండా, ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ఒక నిమిషం పాటు అలాగే ఉండండి. శ్వాస మీద ధ్యాస పెడుతూ, ఆ ఆలింగనంలోని వెచ్చదనాన్ని అనుభూతి చెందండి.
6 సెకన్ల ముద్దు
ప్రముఖ మానసిక నిపుణుడు, సంబంధాల పరిశోధకుడు జాన్ గాట్‌మన్ ప్రకారం, కేవలం ఆరు సెకన్ల ముద్దు మీ బంధంలో అద్భుతాలు చేయగలదు. ఆ కొద్ది క్షణాల్లో మన శరీరం ప్రేమను, భద్రతను, గుర్తింపును పొందిందని గ్రహిస్తుంది.



Click it and Unblock the Notifications