Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేలంటైన్ వేడి - రెస్టరెంట్ ప్రేమ!

రెస్టరెంట్ నుండి బయటకు వెళ్ళి దగ్గరలో వున్న పూల దుకాణం నుండి ఒక రంగురంగుల పూల గుత్తిని కొన్నాను. ఆ వేలంటైన్ బూకే అందిస్తూ ఆమెను నేను ఇష్టపడుతూన్నట్లు చెవిలో చెప్పేశాను. నేను చేసిన పని ఏదో సినిమాలోలా వుందని అనిపించింది. కాని యువతులకు ఈ రకమైన రొమాన్స్ ఇష్టం వుంటుందని అనిపించి అలా చేసేశాను. పూల గుత్తి చేతికిస్తూ ఐ లవ్ యూ వేరీ మచ్ అనేశాను.
ఇప్పటికి నేను మరిచిపోలేను. రెస్టరెంట్ లో ఎంతోమంది వున్నప్పటికి ఆమె అంటే నాకుగల ఇష్టం ఎవరిని కనపడకుండా చేసింది. చూసిన ప్రతిఒక్కరూ నేను చేసిన చర్యకు గుసగుసలాడారు. నన్నో పిచ్చివాడని భావించారు. అయినా నేను లెక్క చేయలేదు. నేను పిచ్చివాడినే....నా ఈషా కొరకు. ఐ లవ్య యూ అని చెప్పేయటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
నా ప్రేమ కధలో తర్వాతి అంశంగా ఆమెకు ఒక చాక్లెట్ల బాక్స్ ను బహుకరించాను. ఆమె తీసుకుంది. నా ప్రతిపాదన అంగీకరించింది. ఆ విధంగా నా ప్రేమ కధ ఒక వేలంటైన్ రోజు పుట్టింది. ఇప్పటికి ఆ కాలేజ్ రొమాన్స్ మరువలేను. నేను చేసిన పని ఎంతో ఫన్నీగా వున్నా ఆ వేలంటైన్ రోజు నాకు ప్రత్యేకమే. అది ఒక వాస్తవం...పవిత్రమైన సంఘటనగా భావించాను.
వేలంటైన్ రోజును ఇద్దరం కలిసి ఒక ధియేటర్ లో సినిమా చూడటంతో జరుపుకున్నాం. సినిమా తర్వాత ఆమెను ఇంటివద్ద డ్రాప్ చేశాను. ఇద్దరం కూర్చుని ఆటోలో వెడుతూంటే, ఎంతో ఆనందంగా వుంది. నా ప్రేమ జీవితం వేలంటైన్ రోజే మొదలైంది. నేను ప్రేమలో పూర్తిగా నమ్ముతున్నాను. అదొక అద్భుతమైన చేష్టగా భావిస్తున్నాను. కలసి వున్న మధురానుభూతులు. ఇదే నావేలంటైన్ రోజు ప్రేమ కధ.



Click it and Unblock the Notifications